సైరాకి ఇక రీషూట్లు లేవు, చెక్కడాలు లేవు

సైరాకి ఇక రీషూట్లు లేవు, చెక్కడాలు లేవు

'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని మొదట్లో అదే పనిగా చెక్కారు. దీని వల్ల వర్కింగ్‌ డేస్‌ పెరిగి బడ్జెట్‌ అవధులు దాటింది. ఇంకా ఖర్చు పెడితే ఎంత హిట్‌ అయినా కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అయ్యే ప్రమాదం వుందని భావించి ఇక చెక్కడం మానేసారు. మొదట్లో ప్రతి సీన్‌కి ఎంత కేర్‌ తీసుకున్నారో, చివర్లో అంత మామూలుగా కానిచ్చేస్తున్నారు. ఫస్ట్‌ కాపీ చూసుకున్న తర్వాత రీషూట్స్‌ పెట్టడం కానీ, మళ్లీ ఇంకోసారి ప్యాచ్‌వర్క్‌లు పెట్టడం కానీ జరగదట. మార్చి నెలాఖరుతో సైరా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత చిరంజీవి తదుపరి చిత్రంతో బిజీ అయిపోతారు.

మార్చి తర్వాత సింగిల్‌ డే కూడా షూటింగ్‌ చేయడానికి వీల్లేదని చిరంజీవి తెగేసి చెప్పడంతో దర్శకుడు సురేందర్‌ రెడ్డి లాస్ట్‌ వర్కింగ్‌ డేస్‌లో సింగిల్‌ మినిట్‌ కూడా వేస్ట్‌ చేయడం లేదట. మార్చి తర్వాత సెట్స్‌ మీదకి వెళ్లే అవకాశమే లేదు కనుక ఈలోగానే అన్ని కరక్షన్లు చేసుకోవాల్సి వుంటుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కూడా నాలుగైదు నెలల్లో పూర్తి చేసి దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసి తీరాలని చెప్పడంతో గ్రాఫిక్స్‌ వర్క్‌ కూడా రెండు టీమ్‌లతో వేగంగా జరుగుతోంది. మే నెల నుంచి పబ్లిసిటీ స్టార్ట్‌ చేసి పక్క రాష్ట్రాల్లో కూడా దీనికి క్రేజ్‌ తీసుకొచ్చే విధంగా పావులు కదుపుతున్నట్టు తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English