తారక్‌ భరోసా ఇచ్చినా చలనం లేదు

తారక్‌ భరోసా ఇచ్చినా చలనం లేదు

నందమూరి అభిమానుల్లో ఒక విధమైన నిస్తేజం, నిర్లిప్తత అలముకున్నాయి. ఎన్టీఆర్‌ బయోపిక్‌ అంత ఫ్లాప్‌ అవడానికి అభిమానులు కదిలి రాకపోవడం కూడా ఒక కారణమే. సినిమా ఎలా వున్నా ఫాన్స్‌ అయినా చూస్తారని నందమూరి బాలకృష్ణ భావించాడు.

కానీ అభిమానులు కూడా మహానాయకుడు చిత్రాన్ని పట్టించుకోకపోవడం ఆయనని కలచి వేస్తోంది. ఇదిలావుంటే శుక్రవారం నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ సినిమా 118 వస్తోంది. ఈ చిత్రానికి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చాలా వీక్‌గా వున్నాయి. ఇది కళ్యాణ్‌రామ్‌ కెరియర్లో ఉత్తమ చిత్రమని జూనియర్‌ ఎన్టీఆర్‌ పేర్కొన్నాడు.

అతనొక్కడే, పటాస్‌లాంటి చిత్రాలు చేసిన కళ్యాణ్‌రామ్‌ కెరియర్లో ఉత్తమ చిత్రమంటే ఖచ్చితంగా దానికి బెస్ట్‌ క్వాలిటీస్‌ వున్నట్టే. అయితే తారక్‌ ఇచ్చిన భరోసాని ఫాన్స్‌ సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. అన్నయ్య కోసం మాట వరసకి ఆ మాట అని వుంటాడన్నట్టుగా ఫాన్స్‌ 118 పబ్లిక్‌ వర్డిక్ట్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

శుక్రవారం వచ్చే రివ్యూలు, పబ్లిక్‌ టాక్‌ చూసిన తర్వాత వీకెండ్‌లో ఈ చిత్రాన్ని చూడాలా, వద్దా అనేది డిసైడ్‌ అవుతారో ఏమో. ప్రీ రిలీజ్‌కి ఇంత లో బజ్‌ వున్నపుడు టాక్‌ చాలా బ్రహ్మాండంగా వచ్చి తీరాలి. కళ్యాణ్‌రామ్‌కి వచ్చిన అతనొక్కడే, పటాస్‌లాంటి పెద్ద హిట్లు అలా మౌత్‌ టాక్‌తో వచ్చినవే కనుక అప్పుడే బెంగ పడాల్సిన పనిలేదులెండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English