త్రివిక్రమ్‌ మళ్ళీ దూరం పెట్టాడు

త్రివిక్రమ్‌ మళ్ళీ దూరం పెట్టాడు

త్రివిక్రమ్‌తో దేవిశ్రీప్రసాద్‌కి చాలా మంచి ఈక్వేషన్‌ వుండేది. జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలకి దేవితోనే మ్యూజిక్‌ చేయించుకున్న త్రివిక్రమ్‌ అటు తర్వాత దేవిని దూరంగా పెట్టాడు. అతడికి బదులుగా వేరే సంగీత దర్శకుడితో ర్యాపో కోసం ట్రై చేస్తున్నాడు. అఆకి మిక్కీ మేయర్‌, అజ్ఞాతవాసికి అనిరుధ్‌, అరవింద సమేతకి తమన్‌తో మ్యూజిక్‌ చేయించుకున్నాడు. అల్లు అర్జున్‌తో తాజా చిత్రానికి కూడా తమన్‌ని కంటిన్యూ చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తోంటే, దేవితో చేయించుకుందామని అల్లు అర్జున్‌ చెప్పాడట. తన చిత్రాలకి దేవి మంచి మ్యూజిక్‌ ఇస్తుంటాడు కనుక అతనితోనే చేయాలని వుందని బన్నీ అన్నాడట.

అయితే తమన్‌ ఈ చిత్రానికి ఫ్రెష్‌ మ్యూజికల్‌ స్కోర్‌ ఇస్తాడని, తమన్‌లా దేవి ఫ్లెక్సిబుల్‌ కాదని, తాను ఇచ్చిన ట్యూన్లనే వాడుకోమంటాడని చెప్పి తమన్‌తో చేయించడానికి కన్విన్స్‌ చేసాడట. మరి దేవిశ్రీప్రసాద్‌తో మరోసారి పని చేయకూడదని గట్టిగా ఫిక్స్‌ అయ్యేంతగా త్రివిక్రమ్‌తో అతడికి ఏమి గొడవ వచ్చిందోనని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. అసలే దేవి గ్రాఫ్‌ డౌన్‌లో వుంది కనుక ఇప్పుడిలాంటి పెద్ద సినిమాలని పోగొట్టుకునే రిస్కు చేయలేడు. త్వరగా అతనికి వున్న విబేధాలు క్లియర్‌ చేసుకోకపోతే ఇతర సంగీత దర్శకులు ముందుకి దూసుకెళ్లిపోతారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English