'మహానాయకుడు’ కోసం ఎదురు చూస్తున్నారు

'మహానాయకుడు’ కోసం ఎదురు చూస్తున్నారు

డిజిటల్ హక్కుల రూపంలో నిర్మాతలకు కొత్త ఆదాయ వనరు దొరికిన సంబరం బాగానే ఉంది. కానీ అది ప్రధాన ఆదాయానికి గండి కొట్టేలా కనిపిస్తుండటమే ఆందోళన రేకెత్తిస్తోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత కొన్ని నెలలైనా విరామం లేకుండా అమేజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌లో సినిమా వచ్చేయడం పట్ల అగ్ర నిర్మాత సురేష్ బాబు గతంలో వ్యక్తం చేసిన ఆందోళనే నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రిలీజైన నెల రోజులకే కొత్త సినిమాలు అమేజాన్లో వచ్చేస్తుండటంతో జనాలు క్రమంగా థియేటర్లకు రావడం మానేస్తున్నట్లే కనిపిస్తోంది వ్యవహారం.

కొత్త ఏడాది మొదలై రెండు నెలలు కాలేదు. ఈ రెండు నెలల్లో వచ్చిన ప్రముఖ చిత్రాలన్నీ అమేజాన్ ప్రైంలోకి వచ్చేశాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన మూడు పెద్ద తెలుగు సినిమాలు ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’.. ‘వినయ విదేయ రామ’.. ‘ఎఫ్-2’ అమేజాన్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాయి. వీటిని థియేటర్లలో చూసిన, చూడని వాళ్లందరూ ఇప్పుడు అమేజాన్ మీద పడ్డారు.

‘యన్.టి.ఆర్’ సినిమాకు థియేటర్లలో కంటే అమేజాన్‌లోనే రెస్పాన్స్ బాగున్నట్లు చెబుతున్నారు. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘మహానాయకుడు’ థియేటర్ల వైపు జనాలు వెళ్లట్లేదు. ‘కథానాయకుడు’ను అమేజాన్లో చూసిన వాళ్లంతా.. ‘మహానాయకుడు’ డిజిటల్ ఫ్లాట్ ఫాంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ దిశగా ఆరాలు నడుస్తున్నాయి. ‘కథానాయకుడు’ అమేజాన్లో రిలీజయ్యాక ‘మహానాయకుడు’ మాత్రం ఎందుకు రాదులే అని ధీమాగా ఉన్నారు. రెండు మూడు వారాల్లోనే అది కూడా అక్కడ దిగిపోవచ్చు.

సినిమాల పోస్టర్లపై, టైటిల్స్ పడేటపుడు ఆరంభంలో అమేజాన్ ప్రైమ్ లోగో చూస్తున్న జనాలు.. కొన్ని రోజుల్లోనే ఆన్ లైన్లో సినిమా చూడొచ్చన్న అభిప్రాయానికి వచ్చేస్తుండటంతో థియేటర్లలో వసూళ్లపై బాగానే ప్రభావం పడుతున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తానికి అమేజాన్ డ్యామేజ్ మున్ముందు పెద్ద స్థాయిలోనే ఉండబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English