సమ్మర్ కాదు.. ఆగస్టే ఎగ్జైటింగ్

సమ్మర్ కాదు.. ఆగస్టే ఎగ్జైటింగ్

తెలుగు సినీ ప్రియులకు సంక్రాంతి తర్వాత ఎక్కువ ఆసక్తి రేకెత్తించే సీజన్ వేసవే. ప్రతి ఏడాదీ ఈ సీజన్లో భారీ సినిమాలు షెడ్యూల్ అవుతుంటాయి. గత ఏడాది ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’.. ‘నా పేరు సూర్య’ లాంటి భారీ చిత్రాలు వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఈసారి సమ్మర్లో భారీ చిత్రాల తాకిడి పెద్దగా ఉండేట్లు కనిపించడం లేదు.

ఈ వేసవికి షెడ్యూల్ అయిన ఏకైక పెద్ద సినిమా ‘మహర్షి’ కూడా వాయిదా పడ్డట్లు వార్తలొస్తున్నాయి. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని చిత్ర బృందం ఖండించని నేపథ్యంలో వాయిదా నిజమే అనుకోవాలి. ఆ చిత్రం జూన్లో రిలీజయ్యే అవకాశముంది. సమ్మర్లో రాబోయే మిగతా చిత్రాలన్నీ మీడియం రేంజివే. ఐతే వేసవితో పోలిస్తే ఆగస్టు నెల ఎక్కువ ఎగ్జైటింగ్‌గా కనిపిస్తుండటం విశేషం.

స్వాంతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ కాబోయే ‘సాహో’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి’ లాంటి మెగా మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రమిది. ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజవుతుంటే హంగామా మామూలుగా ఉండదు. ఈ ఏడాది తెలుగులో ఇదే అతి పెద్ద సినిమాగా భావించవచ్చు.

అదే ఆగస్టు నెలలో ఇంకో రెండు ఎగ్జైటింగ్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి నాని ‘గ్యాంగ్ లీడర్’. ఇటీవలే చిత్రీకరణ ఆరంభించుకున్న ఈ చిత్రాన్ని జూన్-జులై నెలలకల్లా పూర్తి చేసి ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే టైటిల్ ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మరోపు శర్వానంద్-సమంతల క్రేజీ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిస్తున్న ‘96’ సినిమా కూడా ఆగస్టుకే షెడ్యూల్ అయింది. అలాగే నితిన్ సినిమా ‘భీష్మ’ కూడా ఆగస్టులోనే వచ్చే అవకాశముంది. మొత్తానికి ఆగస్టు నెలలో సినీ ప్రియులకు పండగన్నమాటే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English