పాకిస్థాన్‌కు గడ్డిపెట్టిన పాకిస్థానీ

పాకిస్థాన్‌కు గడ్డిపెట్టిన పాకిస్థానీ

తెలుగులో ‘వర్షం’.. ‘ఊసరవెల్లి’.. ‘100 పర్సంట్ లవ్’.. లాంటి సినిమాల్లో పాటలు పాడిన సింగర్ అద్నాన్ సమి తెలుసు కదా? బాలీవుడ్లో కూడా అతను లెక్కలేనన్ని పాటలు పాడాడు. అతను స్వతహాగా పాకిస్థానీ. అక్కడే పుట్టాడు. అక్కడే పెరిగాడుు. ఐతే భారతీయ సినిమాల్లో అవకాశాలు రావడం, పైగా పాకిస్థాన్‌లో పరిస్థితులు అధ్వాన్నంగా ఉండటంతో అక్కడి నుంచి వలస వచ్చేశాడు.

భారతీయ పౌరసత్వం తీసుకుని ఇక్కడే సెటిలైపోయాడు. ఐతే పాకిస్థాన్ నుంచి వచ్చాడు కదా.. ఎంతైనా సొంత దేశం మీదే ప్రేమ ఉంటుందని.. తన దేశం తప్పు చేసినా ఊరుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ పుల్వామా ఉగ్రదాడికి బదులుగా భారతీయ వాయు దళం పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేసిన నేపథ్యంలో అతను పూర్తిగా భారత్‌కే మద్దతు ఇచ్చాడు. పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్ చేశాడు.

భారత్ చేసిన దాడి మీద పాకిస్థానీలు సోషల్ మీడియాలో వక్రీకరణలు చేస్తుండటం, తనను కూడా ట్రోల్ చేస్తుండటంతో అద్నాన్ స్పందించాడు. ‘‘ప్రియమైన పాకిస్థానీ ట్రోల్స్.. ఇది మన అహాల్ని పక్కన పెట్టి వాస్తవాల్ని సమీక్షించుకోవాల్సిన సమయం మాత్రమే కాదు. మీకు కూడా శత్రువులు అయిన ఉగ్రవాదుల్ని అంతమొంచే సమయం. మీ మూర్ఖపు ఆలోచన నవ్వు తెప్పిస్తోంది. మీ తిట్లు మ ీ వాస్తవికతను ఎత్తి చూపిస్తున్నాి. మీకు.. ఒక బకెట్ మలినానికి మధ్య తేడా బకెట్ మాత్రమే’’ అంటూ గట్టిగా పాకిస్థానీలకు పంచ్ ఇచ్చాడు అద్నాన్. తన ట్విట్టర్ ప్రొఫైల్లో అద్నాన్ తన డిస్క్రిప్షన్లో ‘ప్రౌడ్ ఇండియన్’ అని పెట్టుకోవడం విశేషం. ఒకప్పుడు దాదాపు 200 కిలోల బరువుతో కదలడానికి కూడా ఇబ్బంది పడ్డ అద్నాన్.. సర్జరీ చేయించుకుని బాగా సన్నబడి సాధారణ వ్యక్తుల్లా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతను భారత్‌కు వచ్చి స్థిరపడ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English