నందమూరి పరువు నిలబెడతాడా?

నందమూరి పరువు నిలబెడతాడా?

బాలకృష్ణ కెరియర్లో ఫ్లాపులెన్నో వున్నాయి. కొన్ని ఏళ్ల పాటు అతడిని పరాజయాలు వేధించిన సందర్భాలున్నాయి. కానీ తెలుగు సినిమాపై చెరిగిపోని ముద్ర వేసిన లెజెండ్‌ ఎన్టీఆర్‌ కథని సినిమా తీస్తే అది తెలుగు సినీ చరిత్రలో అతి ఘోరమైన పరాజయాల్లో ఒకటిగా నిలవడం అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఈ చిత్రం త్వరగా థియేటర్లనుంచి వెళ్లిపోతే ఈ గాయం నుంచి కోలుకోవచ్చునని ఫాన్స్‌ ఎదురు చూసే పరిస్థితి వుంది. ఫాన్స్‌ మొరేల్‌ దారుణంగా దెబ్బ తిన్న ఈ టైమ్‌లో తన సినిమా విడుదల చేయడానికి సాహసిస్తున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్‌.

తన గత చిత్రం 'నా నువ్వే' ఆనవాళ్లు లేకుండా ఫ్లాపయిన నేపథ్యంలో ఇది సాహసమే అనాలి. అయితే ప్రస్తుతం థియేటర్ల ఫీడింగ్‌కి కూడా ఒక సినిమా అంటూ లేని స్థితిలో బాగుందనే టాక్‌ తెచ్చుకుంటే 118 బెనిఫిట్‌ అవుతుంది. మహానాయకుడు పరాభవం నుంచి కోలుకోవాలని చూస్తోన్న అభిమానులకి 'పటాస్‌' లాంటి హిట్‌ ఇచ్చి కళ్యాణ్‌రామ్‌ ఊరటనిస్తాడా? అతని కెరియర్లోనే ఉత్తమ చిత్రమని తారక్‌ అన్న మాటలు ఫాన్స్‌కి కాస్త నమ్మకాన్ని ఇచ్చాయి. అయితే ప్రస్తుత సీజన్‌లో, ఫాన్స్‌ వున్న పొజిషన్‌లో కేవలం ఫర్వాలేదనే టాక్‌ అయితే సరిపోదు. జనాన్ని థియేటర్లకి రాబట్టడానికి అద్భుతంగా వుందనే టాక్‌ జనరేట్‌ అవ్వాలి. మరి 118లో అంత వుందా లేదా అనేది శుక్రవారం తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English