బోయపాటి ముక్కు పిండి వసూలు చేసేసారు

బోయపాటి ముక్కు పిండి వసూలు చేసేసారు

'వినయ విధేయ రామ' ముందు బోయపాటి శ్రీనుతో సినిమా చేయడానికి స్టార్‌ హీరోలు ఎంతో ఆసక్తి చూపించే వారు. పెద్ద నిర్మాతలంతా అతడిని తమ ఫ్యూచర్‌ లిస్ట్‌లో తప్పక వుంచుకునేవారు. కానీ 'వినయ విధేయ రామ'తో కేవలం పరాజయాన్ని మాత్రమే చవిచూడడం కాకుండా తనపై వున్న నమ్మకాన్నే పోగొట్టుకున్నాడు. అలాంటి సినిమా తీసిన తర్వాత బౌన్స్‌ బ్యాక్‌ అవ్వాలంటే అలాంటిలాంటి ఎఫర్ట్‌ చాలదు. అయితే బోయపాటి మాత్రం ఇప్పటికీ 'వినయ విధేయ రామ' విషయంలో రిగ్రెట్‌ అవడం లేదు. అదో సాధారణ పరాజయంలానే మాట్లాడుతున్నాడు.

దీంతో అతడికి అడ్వాన్సులు ఇచ్చిన కొందరు నిర్మాతలు ఇప్పట్లో అతనితో సినిమా వద్దనుకుంటున్నారు. వినయ విధేయ రామ ఫ్లాప్‌ అవగానే తమకి అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వాల్సిందిగా మైత్రి మూవీ మేకర్స్‌ డిమాండ్‌ చేస్తే ఎవరైనా స్టార్‌ హీరో డేట్స్‌ తీసుకుని వస్తానని బోయపాటి చెప్పాడట. కానీ ప్రస్తుతం అతనికి డేట్స్‌ ఇచ్చేందుకు ఏ ఒక్క స్టార్‌ హీరో సిద్ధంగా లేడనేది మైత్రి మూవీస్‌కి తెలియడంతో ముక్కు పిండి మరీ తమ డబ్బులు వసూలు చేసారట. లీగల్‌ కేసులు గట్రా అయితే తన ఇమేజ్‌ మరింత డ్యామేజ్‌ అవుతుందని బోయపాటి కూడా ఎక్కువ ప్రతిఘటించకుండా వాళ్ల డబ్బులు వాపసు ఇచ్చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English