బాలకృష్ణ గాలి తీసేసినట్టుగా!

బాలకృష్ణ గాలి తీసేసినట్టుగా!

బాలకృష్ణ అంటే ఎవర్‌ ఎనర్జిటిక్‌ అన్నట్టుంటారు. వేదికలపై తన తరం హీరోల్లో బాలయ్య అంత చురుకు, ఉత్సాహం ఎవరిలోను కనిపించవంటే అతిశయోక్తి కాదు. మైకు పట్టుకుంటే సంస్కృత శ్లోకాలు వల్లెవేస్తూ తనదైన శైలిలో రంజింప చేస్తుంటారు. అలాంటి బాలకృష్ణ '118' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గాలి తీసేసినట్టుగా నిస్సత్తువగా, నిర్లిప్తంగా కనిపించారు. తనకి సంబంధించని చిత్రమైనా కానీ యూనిట్‌ సభ్యులందరి పేర్లు కరక్ట్‌ చెప్పే బాలకృష్ణ ఈ చిత్రం టైటిల్‌నే గుర్తుంచుకోలేదు.

స్టేజీపై అంత పెద్ద పెద్ద అక్షరాలతో 118 అని టైటిల్‌ వుంటే పలుమార్లు '189' అంటూ పలికారు. బాలకృష్ణ ఎంతగా మహానాయకుడు ఫలితంతో హర్ట్‌ అయ్యారనేది ఆయన వ్యవహార శైలిలోనే తెలిసిపోయింది. బహుశా ఈ ఈవెంట్‌కి హాజరయ్యే మూడ్‌ కూడా ఆయనకి వున్నట్టు లేదు. కానీ ఎన్టీఆర్‌ చిత్రంలో ఉచితంగా నటించడమే కాకుండా ప్రచారానికి తనవంతు చేసాడు కళ్యాణ్‌రామ్‌. అతను పిలిచినపుడు రాననడం భావ్యం కాదు కనుక వచ్చినట్టున్నారు. అయితే బాలకృష్ణని ఇలా చూడడం మాత్రం అభిమానులకి రుచించలేదు. ఈ ఘోర పరాజయం నుంచి బాలయ్య త్వరగా కోలుకుని మళ్లీ సింహం మాదిరిగా గర్జిస్తారని వారంతా ఎదురు చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English