కౌశల్‌ మోసగాడు... ఆర్మీ తిరుగుబాటు

కౌశల్‌ మోసగాడు... ఆర్మీ తిరుగుబాటు

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 టైమ్‌లో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసి కౌశల్‌ని బిగ్‌బాస్‌ విజేతగా నిలబెట్టిన కౌశల్‌ ఆర్మీ ఇప్పుడు తమ 'హీరో' అసలు స్వరూపం తెలిసిందంటూ మీడియాకి ఎక్కి గగ్గోలు పెడుతోంది. కౌశల్‌ చెప్పేదానికీ, చేసేదానికీ పొంతన వుండదని, అభిమానులతో డబ్బులు ఖర్చు పెట్టిస్తుంటాడే తప్ప తన జేబులోంచి రూపాయి బయటకి తీయడని ఆర్మీ ఆరోపిస్తోంది. ఎక్కడికి అతడిని రమ్మన్నా కూడా అందులో తనకేంటి లాభమని చూసుకుంటాడని, ప్రతి చిన్న ఈవెంట్‌కి కూడా డబ్బులు ఆశిస్తున్నాడని అభిమానులే మీడియా ముందుకొచ్చి మొర పెట్టుకుంటున్నారు.

బిగ్‌బాస్‌ విజేతగా నిలిచినందుకు వచ్చిన యాభై లక్షల ప్రైజ్‌ మనీని కేన్సర్‌ పేషెంట్స్‌ కోసం ఖర్చు పెడతానని ప్రకటించిన కౌశల్‌ ఇంతవరకు ఎలాంటి సేవా కార్యక్రమం చేయలేదని, ఇదేమిటని అడిగితే ''నా డబ్బు నేను ఎలాగైనా ఖర్చు పెడతాను. లేదా మాట తప్పుతాను. మీకేంటి'' అని అంటున్నాడని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో మిగతా వారిని ట్రోల్‌ చేయమంటూ రెచ్చగొడతాడని చెబుతూ అతను పంపిన వాయిస్‌ మెసేజ్‌ని కూడా బయట పెట్టారు. మొత్తానికి ఏ అభిమానుల బలంతో అయితే పాపులర్‌ అయ్యాడో ఇప్పుడు వారి కోపాన్నే చవిచూస్తూ కౌశల్‌ మీడియా సాక్షిగా తన పేరు మొత్తం పోగొట్టుకుంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English