బాలకృష్ణ, జూ|| ఎన్టీఆర్‌ లింక్‌ కట్‌ కానివ్వట్లేదు

బాలకృష్ణ, జూ|| ఎన్టీఆర్‌ లింక్‌ కట్‌ కానివ్వట్లేదు

బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ మధ్య సంబంధాలు సరిగా లేవనేది పలుమార్లు రుజువయింది. ఇటీవల వారిద్దరూ కలిసి వేదికలపై కనిపిస్తున్నా కానీ మునుపటి బాబాయ్‌-అబ్బాయ్‌ అనుబంధం అయితే కానరావడం లేదు. స్టేజీపై తప్ప బయట బాబాయ్‌పై అభిమానాన్ని చూపించడానికి ఎన్టీఆర్‌ ససేమీరా అంటున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మద్దతు తెలపకపోవడం, ప్రచారానికి రాకపోవడం మాట అయితేనేమి, 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ గురించి కనీస స్పందన తెలియజేయక పోవడం అయితేనేమి... జూనియర్‌ ఎన్టీఆర్‌ ఖచ్చితంగా 'బాబాయ్‌'తో డిస్టెన్స్‌ పాటిస్తున్నాడనేది తేటతెల్లం.

అయితే జూనియర్‌ సంగతి ఇలా వుంటే కళ్యాణ్‌రామ్‌ మాత్రం బాలకృష్ణకి సన్నిహితంగా వుంటున్నాడు. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో నందమూరి హరికృష్ణ పాత్ర పోషించడంతో పాటు బాలయ్య, ఎన్టీఆర్‌ మధ్య బంధం తెగిపోకుండా చూసుకుంటోన్నది అతడేనట. బయోపిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి జూనియర్‌ ఎన్టీఆర్‌ వెళ్లడానికి, ఇప్పుడు '118' ఈవెంట్‌కి బాలకృష్ణ, ఎన్టీఆర్‌ ఇద్దరూ హాజరు కావడానికి కళ్యాణ్‌రామ్‌ ప్రోద్బలమే కారణమట. మరి కళ్యాణ్‌రామ్‌ అదే పనిగా చేస్తోన్న ప్రయత్నాలతో అయినా ఈ బంధం బలపడుతుందేమో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English