వినయ విధేయ రామ.. సీన్లకి రిపీట్ ఆడియన్స్

వినయ విధేయ రామ.. సీన్లకి రిపీట్ ఆడియన్స్

బ్లాక్ బస్టర్లకే రీ రిలీజ్ సీన్ లేని రోజులివి. మరి ‘వినయ విధేయ రామ’ లాంటి భారీ డిజాస్టర్‌ను థియేటర్లలో రీ రిలీజ్ చేసే సీన్ ఎక్కడుంది? ఇప్పుడు రీరిలీజ్ అనే మాట డిజిటల్ ఫ్లాప్ ఫాం విడుదల విషయంలోనే మాట్లాడుతున్నారు. థియేటర్లలోకి ఒక కొత్త సినిమా రాగానే ఎప్పుడెళ్లి థియేటర్లకు చూద్దామాని ఓ వర్గం ప్రేక్షకులు చూస్తుంటే.. అది డిజిటల్ ఫ్లాట్ ఫాంలోకి ఎప్పుడొస్తుందా చూసేద్దాం అని మరో వర్గం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. హిట్.. ఫ్లాప్ అని సంబంధం లేకుండా వర్గం ప్రతి సినిమానూ చూస్తుంటుంది. ఈ మధ్య ఏ పెద్ద సినిమా అయినా నెలా నెలన్నరకే ఆన్ లైన్లో రిలీజవుతోంది. ‘వినయ విధేయ రామ’ థియేటర్లలోకి వచ్చిన 50 రోజులకు అమేజాన్ ప్రైమ్‌లో ఈ రోజే రిలీజైంది. ఇక ఉదయం నుంచే జనాలు ఈ సిినిమా చూడ్డం మొదులపెట్టారు. సినిమా చూసి సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలుపెట్టారు.

సంక్రాంతి టైంలో ఏ సన్నివేశాల గురించి అంతగా చర్చ జరిగిందో.. ట్రోల్ చేశారో ఆ సన్నివేశాలే ఇప్పుడు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. థియేటర్లలో మాదిరి మొత్తం సినిమా తప్పనసరిగా చూడాల్సిన పని ఇక్కడ లేదు. నచ్చని చోట డ్రాగ్ చేసి.. ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. ఆ రకంగా ఆ ఆణిముత్యాల్లాంటి సీన్ల దగ్గరికెళ్లి రిపీట్స్ కొడుతున్నారు డిజిటల్ ఆడియన్స్. హీరో ఇద్దరు విలన్ల తలకాయలు నరికితే గద్దలు వాటిని ఎత్తుకెళ్లిపోయే సీన్.. రైలెక్కి రామ్ చరణ్ బీహారెళ్లిపోయే సన్నివేశం.. విలన్ కరిచి పాము చచ్చిపోయే సీన్.. ఇవన్నీ ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చాయి. చరణ్ గత సినిమా ‘రంగస్థలం’ కూడా అమేజాన్లోకి సరిగ్గా 50 రోజులకే వచ్చింది. ఐతే ఆ సినిమా అక్కడికి వచ్చే సమయానికి కూడా థియేటర్లలో చాలా బాగా ఆడుతోంది. కానీ ‘వినయ విధేయ రామ’ పది రోజులు తిరక్కుండానే అడ్రస్ లేకుండా పోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English