అంబానీ ఇంట పెళ్లి...బాలీవుడ్ అంతా స్విస్ చేరింది

అంబానీ ఇంట పెళ్లి...బాలీవుడ్ అంతా స్విస్ చేరింది

దేశీయ వ్యాపార‌ దిగ్గ‌జం ముకేశ్ అంబానీ ఇంట వివాహం అంటే ఎలా ఉంటుంది? అంగ‌రంగ వైభ‌వంగా అనే సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు క‌ద‌. తాజాగా ఆ హంగూ ఆర్భాటం మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది. ఆకాశ్ అంబానీ వివాహం మార్చి 9 న జరగనుంది. ఆకాశ్ పెళ్లి.. డైమాండ్ మాగ్నెట్ రస్సెల్ మెహతా కూతురు శ్లోకాతో జరగనుంది. అయితే.. పెళ్లికి ఇంకా సమయం ఉన్నప్పటికీ పెళ్లి వేడుకలు మాత్రం ఎప్పుడో ప్రారంభ‌మ‌య్యాయి. తాజాగా ఆకాశ్, శ్లోకా ప్రీ వెడ్డింగ్ వేడుకలు స్విట్జర్లాండ్‌లో జరుగుతున్నాయట. దీంతో ప్రీ వెడ్డింగ్ పార్టీకి బాలీవుడ్ కదిలింది.

ప్రముఖ సింగర్ ఫాల్గుని పతక్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకాశ్ పెళ్లి వేడుకలు కొన్ని రోజుల కింద ప్రారంభమయ్యాయి. ఆకాశ్ మొదటి పెళ్లి పత్రికను ముంబైలోని సిద్ధివినాయకుడి గుడిలో పెట్టి ముకేశ్, నీతా పూజలు చేశారు. గత సంవత్సరం ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఆకాశ్, శ్లోకా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మార్చి 9న ముంబైలో జరగ‌బోయే వివాహం కంటే ముందు తన స్నేహితుల కోసం, బాలీవుడ్ ప్రముఖుల కోసం ముకేశ్.. ప్రీవెడ్డింగ్ పార్టీని స్విట్జర్లాండ్‌లో ఏర్పాటు చేశారట. ఈ పార్టీ మూడు రోజులు ఉంటుందట. స్విస్‌లోని పిక్చర్‌స్క్యూ సెయింట్ మోరిట్జ్‌లో పార్టీ జరగనున్నట్టు సమాచారం. ఇందు కోసం బాలీవుడ్ తార‌లంతా స్విట్జ‌ర్లాండ్ త‌ర‌లివెళ్తున్నారు.

బాలీవుడ్‌ జంట పక్షులు అలియా భట్ అండ్ రణ్‌బీర్ కపూర్, మలైక అరోరా అండ్ అర్జున్ కపూర్ ఆకాశ్ ప్రీ వెడ్డింగ్ పార్టీకి స్విస్‌కు వెళ్లారు. వీళ్లే కాదు.. కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ, నటాషా, అడార్ పూనవల్లా కూడా స్విస్‌కు వెళ్లారు.. వీళ్లంతా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పాప్పరాజీ కంట పడ్డారు. ఇప్పటికైతే వీళ్లు వెళ్లినట్టు తెలుస్తోంది. కానీ.. పాప్పరాజీ కంట పడకుండా స్విస్‌కు చాలామంది బాలీవుడ్ ప్రముఖులు వెళ్లినట్టు స‌మాచారం. ఇటీవలే ముంబైలో ముకేశ్ కూతురు ఈషా పెళ్లి కూడా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కూతురు వివాహం కంటే గ్రాండ్‌గా అంబానీ త‌న త‌న‌యుడి వివాహం చేస్తున్నార‌ని టాక్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English