వాళ్ల కాళ్లు కగిడి షో చెయ్యొద్దు బాస్

వాళ్ల కాళ్లు కగిడి షో చెయ్యొద్దు బాస్

మన దేశానికి పనిచేసిన ప్రధాన మంత్రులందరిలోకీ .. పబ్లిసిటీని నమ్ముకుని ఫేం సాధించిన వ్యక్తి ఎవరూ అనే 100 మార్కుల ప్రశ్నకు.. నరేంద్ర మోడి అనే సింగిల్ వర్డ్ సమాధానమే చెప్పాలి. డిజిటల్ విప్లవాన్ని ఆయన తన ప్రచారాయుధంగా బాగా వాడేసుకున్నాడు. వాడుకుంటూనే ఉన్నాడు. కాని ఇప్పుడు ఇతరులు కూడా అదే రేంజులో డిజిటల్ మీడియను వాడుతుంటడటంతో.. మోడీకి కాస్త ఇబ్బందులు తప్పట్లేదు.

ఓ రెండు రోజుల క్రితం కుంభ మేళాలో పనిచేసిన పారిశుద్ద్య కార్మికులు (శానిటేషన్ వర్కర్స్) కాళ్ళు కడిగి మహా పుణ్యం చేసుకున్నారు శ్రీ నరేంద్ర మోడి. గతంలో శానిటేషన్ పని చేయడం అనేది మహా పుణ్యంతో సమానం అంటూ కామెంట్స్ చేసిన మోడి.. ఇప్పుడు కాళ్లు కడిగే సీన్ ను కూడా శతమానం భవతి సినిమా రేంజులో ప్రమోషన్ చేయిస్తున్నారు.

అయితే దీనిపై ఎవ్వరు సైలెంట్ గా ఉన్నా కూడా, రీసెంటుగా రాజకీయాల్లోకి వచ్చిన నటుడు ప్రకాష్‌ రాజ్ మాత్రం కాస్త గట్టిగానే తగులుకున్నారు. అసలు డ్రైనేజీల్లో ఒక మనషి పీకల్లోతు వరకు మునిగి.. కక్కోసును కూడా క్లీన్ చేయడం అనేది చాలా దారుణం. అలాంటి పారిశుద్య కార్మికులకు మిషనరీ ఇవ్వకుండా, జాబ్ సెక్యూరిటీ అనేది కల్పించకుండా, వారి పిల్లలకు ఉచిత చదువులు చెప్పించకుండా.. ఇలా కేవలం కాళ్లు కడిగి ఎలక్షన్ల ముందు షో చెయ్యద్దు బాస్ అంటూ ప్రకాష్‌ ఒక వీడియోతో సహా రంగంలోకి దిగాడు.

నిజానికి ప్రకాష్‌ రాజ్ కామెంట్లతో చాలామంది ఏకీభవిస్తున్నారు. మన దేశంలో ఇంకా 7 లక్షల మంది పారిశుద్య కార్మికులు రోజూ ఇలా డ్రైనేజీల్లోకి దూకి పనులు చేస్తున్నారంటే వారి పరిస్థితిని మనం అర్ధంచేసుకోవచ్చు. వారి జీవితాలను మెరుగుపరచాల్సిందిపోయి.. వాళ్ల కాళ్లు కడిగి వాటిని వీడియోల రూపంలో ప్రమోట్ చేసుకోవడం అనేది అర్ధరహితం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English