మాజీ బాయ్ ఫ్రెండుతో మళ్ళీ కలిసిందా?

మాజీ బాయ్ ఫ్రెండుతో మళ్ళీ కలిసిందా?

బాలీవుడ్లో ఒక ట్రెండ్ ఏంటంటే.. కత్రినా నుండి సోనాక్షి వరకు.. వాళ్ళకు బ్రేక్ వచ్చే వరకు ఒక స్టార్ హీరోను పట్టుకుని వేలాడుతూ ఉంటారు. కత్రినా అయితే సల్మాన్ ఖాన్ ను ఒక రేంజులో వాడుకుందని అక్కడ అందరూ చెబుతుంటారు. అలాగే సోనాక్షి కూడా అక్షయ్ కుమార్ ను పట్టుకుని బాగానే సెటిల్ అయ్యింది. అయితే తెలుగులో ఇలాంటి యవ్వారాలు మనం రెగ్యులర్ గా చూడం కాని.. ఇక్కడ లేవని మాత్రం చెప్పలేం.

ఒక హీరోయిన్ ఉంది. ఆమె తెలుగులో తన గ్లామర్ తో పాపులార్టీ సాధించి.. నాకు ఇలాంటి పాత్రలు వద్దు అని బాలీవుడ్ వెళ్ళి కూర్చుంది. అక్కడ హిట్లు రాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ తెలుగులో పాగా వేయాలని పావులు కదుపుతోంది. మ్యాటర్ ఏంటంటే.. అసలు ఈమెను తెలుగులో బాగా ప్రమోట్ చేసి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేలా చేసిన ఒక కుర్ర హీరో ఉన్నాడు. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారనేది అప్పట్లో న్యూస్. కాని తనకు స్టార్డమ్ రాగానే అమ్మడు అతన్ని పక్కనపెట్టేసింది. అతను కూడా వరుస ఫ్లాపులతో పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళిపోయాడు.

కట్ చేస్తే.. మొన్న అమ్మడుకు సంబంధించిన ఒక ఈవెంట్లో.. అతను తళుక్కున మెరిశాడు. హడావుడి చేశాడు. మీడియా వాళ్ళు కూడా అతగాడి ప్రెజన్స్ చూసి కాస్త సర్పరైజ్ అయ్యారు. అయితే మాజీ బాయ్ ఫ్రెండుతో ఈ సుందరాంగి మళ్లీ కలిసిపోయిందా లేదంటే ప్రస్తుతం స్లంపులో ఉంది కాబట్టి అతడ్ని తిరిగి వాడుకుంటుందా అంటే మాత్రం.. అప్పుడే కామెంట్ చేయడం కష్టం. కాస్తాగండి, అంతా అర్ధమవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English