గ్యాంగ్ లీడర్ ఒక కామెడీ సినిమాయా?

గ్యాంగ్ లీడర్ ఒక కామెడీ సినిమాయా?

సరే మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఆ టైటిల్ ను వాడుకోవాలంటే.. అమ్మో ఎందుకులే చాలా ఎక్సపెక్టేషన్లు ఉంటాయి అంటూ కంగారుపడుతున్నారు కాబట్టి.. మన న్యాచురల్ స్టార్ నాని 'గ్యాంగ్ లీడర్' అయిపోయాడులే అనుకుందాం. అయితే ఆ టైటిల్ కు ఒక పవర్ ఉంది. ఒక పొగరు ఉంది. ఆ పేరు వింటేనే మనలో కలిగే వైబ్రేషన్లు ఒక రేంజులో ఉంటాయి. మరి నాని వాటిని మ్యాచ్ చేస్తున్నాడా?

ఇకపోతే ఇప్పుడు నాని వదిలిన టైటిల్ తాలూకు టీజర్ చూస్తుంటే.. ఒక కమెడియన్ ఒక పోలీస్ ఆఫీసర్ కు ఏం చెబుతుంటాడంటే.. ఓ ఐదుగురు మహిళల గ్యాంగుకు నాని లీడర్ కాబట్టి.. అతను గ్యాంగ్ లీడర్ అయిపోయాడని చెబతాడు. దాన్ని బట్టి చూస్తే.. ఇదంతా ఒక క్రయిమ కామెడీ అని.. నాని గ్యాంగు కోసం పోలీసులు కూడా వెదుకుతున్నారని అర్దమవుతోంది. అయితే చిన్నపాటి కామెడీ సినిమాకు సెంటిమెంటల్ యాక్షన్ సినిమాకు చెందిన గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పెట్టడం ఎంతవరకు సబబు అనేది ఇప్పుడు సినిమా లవ్వర్ల మదిని తొలిచేస్తున్న క్వశ్చన్.

నిజానికి నాని గ్యాంగ్ లీడర్ టైటిల్ ను తీసుకున్నాడు అనగానే చాలామంది మెగా ఫ్యాన్స్ హర్టయినా అవ్వకపోయినా.. ఆ టైటిల్ పెట్టుకుని ఒక కామెడీ సినిమా తీస్తే మాత్రం అందరూ ఫీలవుతారు. అప్పట్లో చిరంజీవి గ్యాంగ్ లీడర్ టైటిల్ చూసి.. హీరో రాజశేఖర్ ఎలాగైతే గ్యాంగ్ మాస్టర్ అనే సినిమా తీసి నవ్వులపాలయ్యాడో.. ఆ తరహాలోనే ఇప్పుడు నాని కూడా ఏదన్నా మిస్టేక చేస్తాడా అనే సందేహం కలుగుతోంది. చూద్దాం మరి డైరక్టర్ విక్రమ్ కె కుమార్ మనోడికి ఎలాంటి బ్రేక్ ఇస్తాడో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English