ఎన్టీఆర్‌ కథ అక్కడ బాగా సేల్‌ అవుతోంది

ఎన్టీఆర్‌ కథ అక్కడ బాగా సేల్‌ అవుతోంది

ఎన్టీఆర్‌ బయోపిక్‌ థియేటర్లలో సేల్‌ అవడం లేదు కానీ... ఈ బయోపిక్‌ వల్ల బయటకి వచ్చిన వివిధ వాస్తవాలు యూట్యూబ్‌లో బాగా సేల్‌ అవుతున్నాయి. ఎన్టీఆర్‌ గురించి తెలిసిన పలువురు పలు వెబ్‌ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా ఆసక్తికర విశేషాలని షేర్‌ చేసుకుంటున్నారు. దీంతో వీటిని జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు.

థియేటర్లలో ఆడుతోన్న ఎన్టీఆర్‌ సినిమాకి వసూళ్లు లేకపోయినా యూట్యూబ్‌లో ఈ సంగతులకి మాత్రం లక్షల కొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్‌ గురించి తెలిసిన జర్నలిస్టులని, నేతలని, నటులని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు. నిజానికి ఈ విశేషాలన్నీ సేకరించి ఇవే సినిమాగా తీసినట్టయితే వసూళ్లు బ్రహ్మాండంగా వచ్చి వుండేవేమో.

బాలకృష్ణ తీసే బయోపిక్‌లో ఎన్టీఆర్‌ రెండవ వివాహం గురించి కానీ, చంద్రబాబు చేతికి టీడీపీ వెళ్లిపోవడం కానీ వుండదని మొదట్నుంచీ అందరికీ తెలుసు. అందుకే ఈ చిత్రంపై అంతగా ఆసక్తి చూపించలేదు. ఆ విషయంలో ఎన్టీఆర్‌ మహానాయకుడుకి వస్తోన్న వసూళ్లే చెబుతున్నాయి. కానీ వాస్తవానికి దగ్గరగా తీసాడని భావిస్తోన్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రానికి మాత్రం క్రేజ్‌ బాగానే వుంది. బయోపిక్స్‌లో మాగ్జిమం వాస్తవాలు కవర్‌ చేయాల్సిన అవసరం ఎంత వుందనే దానికి ఇదే బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ అనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English