కండిషన్లు పెడుతున్న కాజల్‌ మేడమ్‌

కండిషన్లు పెడుతున్న కాజల్‌ మేడమ్‌

కాజల్‌ అగర్వాల్‌ని ఒప్పించి సైన్‌ చేయించుకోవడం ఇప్పుడు చాలా కష్టమేనటండీ! డైరెక్టర్‌ ట్రాక్‌ రికార్డ్‌ విషయంలో ఆమె చాలా కేర్‌ఫుల్‌గా ఉంటోందట. దడ, వీర చిత్రాలతో తగిలిన షాకుల తర్వాత కాజల్‌ మేల్కొంది. అగ్ర హీరోలతోనే నటించాలని ఏనాడో నిర్ణయించుకున్న కాజల్‌ డైరెక్టర్‌ ఎవరనేది కూడా తప్పకుండా పరిశీలిస్తోంది. డైరెక్టర్‌కి అనుభవం లేకపోతే కనీసం పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌ అయినా అయి ఉండాలని గట్టిగా చెబుతోంది. ఈ విషయంలో ఖచ్చితంగా ఉంటున్న కాజల్‌ తనకి ఎన్ని కోట్లు ఆఫర్‌ ఇచ్చినా టెంప్ట్‌ అవడం లేదు.

ఇటీవల ఓ యువ హీరో సరసన నటించమని ఆఫరిచ్చి రికార్డు రెమ్యూనరేషన్‌ ఇస్తామన్నా వద్దనేసిందట. తనే హీరోతో అయినా నటించాలంటే కనీసం అతనికి రెండు హిట్స్‌ అయినా ఉండాలని అంటోందిట. ఇలాంటి కండిషన్లు మనవాళ్లకే కాకుండా బాలీవుడ్‌లోను అమల్లో పెట్టిందట. బాలీవుడ్‌లో మినిమం ఆఫర్లు కూడా లేని కాజల్‌ తనకి ఇలాంటి కండిషన్స్‌ పెడుతుంటే విని వారంతా అవాక్కవుతున్నారు. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరంటే అల్లాటప్పానా మరి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు