బాలకృష్ణ, క్రిష్‌... ఇంకా వుంది!

బాలకృష్ణ, క్రిష్‌... ఇంకా వుంది!

'గౌతమిపుత్ర శాతకర్ణి'తో మొదలైన బాలకృష్ణ, క్రిష్‌ అనుబంధం 'ఎన్టీఆర్‌' చిత్రానికి కూడా కొనసాగింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ని పలువురితో అనుకున్నా కానీ చివరకు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రానికి క్రియేటివ్‌ పరంగా క్రిష్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలు బెడిసికొట్టాయి. ముఖ్యంగా రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచన దారుణంగా దెబ్బతీసింది. అయితే ఈ నిర్ణయాన్ని క్రిష్‌ సమర్ధించుకుంటున్నాడు. ఎన్టీఆర్‌ కథని మూడు గంటల్లో చెప్పడం కష్టమని, ఒక్క సినిమాగా తీసినా అయిదు గంటల నిడివి వుండేదని చెబుతున్నాడు.

ఎన్టీఆర్‌ కథానాయకుడు థియేటర్లలో ఎక్కువ మంది చూడలేదని, కానీ అమెజాన్‌లో చూసి చాలా మంది తనని ప్రశంసిస్తున్నారని, మహానాయకుడు కూడా రానున్న రోజుల్లో క్లాసిక్‌గా నిలుస్తుందని, ఎన్టీఆర్‌ కథని భావి తరాలు తెలుసుకోవడానికి ఈ చిత్రాలే చూస్తారని అతను అంటున్నాడు. బాలకృష్ణతో తనకి విబేధాలు వచ్చాయనేది ఒట్టి మాట అని, ఇప్పటికీ తమ మధ్య బంధం చాలా బాగుందని, మళ్లీ త్వరలోనే కలిసి మరో చారిత్రిక చిత్రం చేస్తామని క్రిష్‌ చెబుతున్నాడు. వరుసగా అన్నీ పీరియడ్‌ సినిమాలు తీసిన క్రిష్‌ ఈసారి అలాంటి భారం పడని లైట్‌ ఎంటర్‌టైనర్‌ తీసే ఆలోచనలో వున్నాడు. కాకపోతే ఆ చిత్రం మొదలు పెట్టే ముందు కాస్త విరామం తీసుకుంటాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English