సాహోకి బాహుబలి మాదిరి సెట్టింగ్‌

సాహోకి బాహుబలి మాదిరి సెట్టింగ్‌

బాహుబలి చిత్రంతో ప్రభాస్‌కి వచ్చిన జాతీయ వ్యాప్త క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు అనుగుణంగా సాహో చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్‌ చేసారు. రెండు వందల యాభై కోట్లకి పైగా వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేస్తే పని జరగదు. అందుకే హిందీ, తమిళం, మలయాళంలో కూడా విడుదల ప్లాన్‌ చేస్తున్నారు. అయితే మిగిలిన భాషల్లో బాహుబలి మాదిరిగా విడుదలకి ముందే క్రేజ్‌ తెచ్చుకోవాలి.

ప్రతిసారీ బాహుబలి చిత్రంపై వచ్చిన ఆసక్తి రాదు కనుక, బాహుబలి హీరో అన్నంత మాత్రాన వర్కవుట్‌ అవుతుందనే నమ్మకం లేదు కనుక ఈ చిత్రానికి భారీగా హైప్‌ తెచ్చే పనికి ఒక పీఆర్‌ టీమ్‌ని హైర్‌ చేసుకున్నారు. ఆగస్టులో విడుదలయ్యే ఈ చిత్రానికి మార్చి నుంచే పబ్లిసిటీ స్టార్ట్‌ చేయనున్నారు. బాహుబలికి ఎలాగయితే నెమ్మదిగా క్రేజ్‌ బిల్డ్‌ చేసి హిందీ మార్కెట్‌ని కూడా కొల్లగొట్టారో అలాగే ఈ చిత్రాన్ని కూడా మార్కెట్‌ చేయబోతున్నారు. పబ్లిసిటీ కోసమే చాలా కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని సమాచారం. తెలుగులో ఈ చిత్రం నాన్‌ బాహుబలి రికార్డుని అందుకుంటుందనే అంచనాలు వుండడంతో బయ్యర్లు భారీ ఆఫర్లు కోట్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English