బికినీలు, బూతులు సేల్‌ అవలేదు

బికినీలు, బూతులు సేల్‌ అవలేదు

హీరోయిన్లకి బికినీలు వేసేసి, బూతు కంటెంట్‌తో సినిమాని నింపేస్తే కాసులు రాలిపోతాయని కొందరు రాంగ్‌ ఎస్టిమేషన్లు వేస్తున్నారు. ఏవో కొన్ని సినిమాలు లక్‌ కొద్దీ ఆడేసాయని అడల్ట్‌ కంటెంట్‌ని బలవంతంగా జనం నెత్తిన రుద్దే ప్రయత్నం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు హారర్‌ కామెడీలు తీసినట్టే ఇప్పుడు బూతు కామెడీలని తక్కువ బడ్జెట్‌లో రూపొందిస్తూ క్యాష్‌ చేసుకోవాలనే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.

అదే కోవలో వచ్చిన తాజా చిత్రం '4 లెటర్స్‌'. ఎఫ్‌ వర్డ్‌ మెన్షన్‌ చేయకుండా, ఫోర్‌ లెటర్స్‌ అంటూ తెలివితేటలు చూపించారు. ఈ చిత్రంలో బూతులకి, బికినీలకి కొదువ లేదు. హీరోయిన్లు ఇద్దరూ రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసారు. వారి స్కిన్‌షోకి గట్టి ప్రచారం కల్పించారు. అయితే ఈ చిత్రం చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. ఒక వర్గం ప్రేక్షకులైనా ఆదరిస్తారని భావించారు కానీ వారు కూడా దీనిని లైట్‌ తీసుకున్నారు. సినిమా కూడా చెత్తగా వుందనే రిపోర్టులు రావడంతో ఇక బాక్సాఫీస్‌ పరంగా ఎలాంటి చలనమూ లేదు. ఇలాంటి ఫలితాలు చూసాక అయినా ఇలా సొమ్ము చేసుకుందామనే వారు గమ్మున వుంటారో లేదో కొంత కాలం ఆగితేనే కానీ తెలియదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English