ఎఫ్‌ 2కి అక్కడ కోట్లు, ఇక్కడ చీవాట్లు!

ఎఫ్‌ 2కి అక్కడ కోట్లు, ఇక్కడ చీవాట్లు!

కొన్ని సినిమాలు ఎంత బాగున్నాయన్నా క్లిక్‌ అవ్వవు. కొన్ని ఒక మాదిరి చిత్రాలకి కూడా అదృష్టం కలిసి వచ్చి ప్రేక్షకాదరణ అమితంగా దొరుకుతుంది. సంక్రాంతికి రిలీజ్‌ అయిన బ్లాక్‌బస్టర్‌ అయిన 'ఎఫ్‌ 2' అందరినీ మెప్పించలేదు. కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే ప్రేక్షకులని అలరించడంతో దాని మైనస్‌లు కవర్‌ అయిపోయాయి. బాక్సాఫీస్‌ వద్ద ఊహించిన దాని కంటే పెద్ద విజయాన్ని అందుకుని, తెలుగు సినిమా చరిత్రలో టాప్‌ 10 అతిపెద్ద విజయాల జాబితాలోను చేరిపోయింది. దాదాపు ఎనభై కోట్ల షేర్‌ థియేటర్లనుంచి రాబట్టిన ఎఫ్‌2 కొంతకాలం క్రితం అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ అయింది.

థియేటర్లలో ఈ చిత్రం చూడని వారు అమెజాన్‌లో ఎగబడి చూస్తున్నారు. అయితే వీరిలో చాలా మంది ''ఈ సినిమా ఎందుకింత హిట్టయింది'' అంటూ డిస్కషన్లు పెడుతున్నారు. ఇంత నాసిరకంగా స్క్రీన్‌ప్లే రాసుకున్నా, ప్రథమార్ధానికి, ద్వితియార్ధానికి సంబంధమే లేకపోయినా ఈ చిత్రాన్ని ఎందుకంతగా ఆదరించారనేది అమెజాన్‌లో చూసిన చాలా మందికి అర్థం కావడం లేదు. కొన్ని కామెడీ చిత్రాలని థియేటర్లలో జనం మధ్య కూర్చుని చూస్తుంటే చుట్టుపక్కల వారి నవ్వుల స్పందనకి మనకీ నవ్వొస్తుంది. కామెడీ షోలకి వెనక నవ్వుతున్నట్టు బ్యాక్‌గ్రౌండ్‌ ఎఫెక్ట్‌ వేసేది అందుకే. అలాంటి ఎఫెక్టులేమీ లేకుండా, సైలెంట్‌గా ఇంట్లో చూస్తే అవే చిత్రాలు విసుగెత్తించే అవకాశముంది. ఎఫ్‌ 2 కూడా అలాంటిదే అనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English