ఒక్క రోజులో ఫ్లాప్‌ అని డిక్లేర్‌ చేసిన హీరో, డైరెక్టర్‌!

ఒక్క రోజులో ఫ్లాప్‌ అని డిక్లేర్‌ చేసిన హీరో, డైరెక్టర్‌!

సినిమా రిజల్ట్‌ బ్యాడ్‌ అని తెలిసినపుడు దానిని అంగీకరించడానికి కనీసం కొన్ని రోజుల పాటు హీరోలు, దర్శకులు ఎదురు చూస్తారు. కనీసం తొలి వారాంతం అయ్యే వరకు అయినా సినిమా సక్సెస్‌ అంటూ ప్రెస్‌మీట్లు పెడుతుంటారు. కానీ నిన్న విడుదలైన 'మిఠాయి' చిత్రం ఫ్లాప్‌ అయిందని అందులో ఒక హీరోగా నటించిన కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ ప్రకటించేసాడు. అంతే కాక ఈ చిత్రం బలవంతంగా చేసానని, ఎన్ని రిపేర్లు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, ఇకపై ఇలాంటి చిత్రాలు చేయనని అభిమానులకి హామీ ఇచ్చాడు.

ఒక్క రోజులోనే ఇలా ప్రకటించడం బాలేదని, నిర్మాత వైపు నుంచి అయినా ఆలోచించాలని జనం తిట్టి పోయడంతో ట్విట్టర్‌ అకౌంట్‌ డీయాక్టివేట్‌ చేసుకున్నాడు. మరోవైపు ఆ చిత్ర దర్శకుడు కూడా ఈ చిత్రం ఫ్లాప్‌ అయినా గర్వపడుతున్నానని, ఈ చిత్రం ఫెయిల్‌ అయినందుకు టీమ్‌తో కలిసి ఫెయిల్యూర్‌ పార్టీ చేసుకుంటానని ఓపెన్‌ లెటర్‌ రాసాడు. నిర్మాతకి కనీసం కాస్త కలక్షన్‌ అయినా వచ్చే అవకాశాన్ని వీళ్లు ఇలా హానెస్టీ పేరుతో చంపేయడం ఏమిటని సినీ విమర్శకులు, అభిమానులు వీరినే తప్పుబడుతున్నారు. మిఠాయి మొత్తానికి టీమ్‌ అంతటికీ చేదు అనుభవాన్నే మిగిల్చింది పాపం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English