బెల్లం బాబు కళ్లు ఆమెపై పడ్డాయ్

బెల్లం బాబు కళ్లు ఆమెపై పడ్డాయ్

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో ఇప్పటిదాకా చేసినవి ఐదు సినిమాలు. అందులో ఒక్కటీ నిఖార్సయిన హిట్టు లేదు. అయితేనేం టాప్ డైరెక్టర్లతో పని చేశాడు. స్టార్ హీరోయన్లతో జోడీ కట్టాడు. భారీ బడ్జెట్లతో విన్యాసాలు చేశాడు. హీరోగా అతడికంటూ ఒక ఇమేజ్ ఇంకా రాలేదు కానీ.. ప్రతిసారీ స్టార్ హీరోయిన్ల మీదే కన్నేస్తుంటాడు. సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే.. ఇలా టాలీవుడ్ టాప్ లీగ్ హీరోయిన్లందరినీ అతను రౌండప్ చేసేశాడు. ఇక కొత్తగా జోడీ కట్టడానికి పెద్ద స్టార్ హీరోయిన్లెవరూ కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు అతడి కళ్లు టైర్ టు హీరోయిన్లపై పడ్డాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో చేసిన ప్రతి సినిమాతోనూ ఆకట్టుకున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్.. బెల్లంబాబుకు జోడీగా నటించబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘సీత’ సినిమా చేస్తున్న శ్రీనివాస్.. దీని తర్వాత తమిళ హిట్ మూవీ ‘రాక్షసన్’ రీమేక్‌లోో నటించబోతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందటే ఈ సినిమాను భారీ లెవెల్లో లాంచ్ చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుందని ఇంతకుముందు వార్తలొచ్చాయి. ఇంతకుముందు శ్రీనివాస్‌తో ఆమె ‘జయ జానకి నాయక’ చేసింది. అది ఆడలేదు. పైగా ఇప్పుడు రకుల్ పేలవ ఫాంలో ఉంది. లేటెస్ట్ మూవీ ‘దేవ్’ కూడా ఫెయిలైంది. దీంతో రకుల్ వద్దని.. ఆమె స్థానంలోో అనుపమను తీసుకుందామని ఫిక్సయ్యారట. అనుపమ కెరీర్ కూడా అంత సాఫీగా సాగట్లేదు. ఆమె కూడా ఈ మధ్య ఫెయిల్యూర్లు చూసింది. ఇటీవల ఆమె సినిమాల్లో ‘హలో గురూ ప్రేమ కోసమే’ మాత్రమే ఓ మోస్తరుగా ఆడింది. దీంతో అనుకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇలాంటి టైంలో శ్రీనివాస్ సరసన మంచి పారితోషకంతో నటించే ఛాన్స్ రావడంతో మరో ఆలోచన లేకుండా ఒప్పేసుకుందట. తమిళంలో ఆమె పాత్రను అమలాపాల్ చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English