దిల్‌ రాజు కొనేసాడు... ఐతే హిట్టే!

దిల్‌ రాజు కొనేసాడు... ఐతే హిట్టే!

'పటాస్‌' తర్వాత మళ్లీ విజయాన్ని అందుకోలేకపోయిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ '118' చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. కె.వి. గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ థ్రిల్లర్‌ రెగ్యులర్‌ కమర్షియల్‌ అంశాలు లేకుండా నేటి తరం ప్రేక్షకులు ఇష్టపడే అంశాలతో తెరకెక్కుతోంది.

టీజర్‌కి స్పందన కూడా బాగుంది. అయితే కళ్యాణ్‌రామ్‌ ఇటీవలి చిత్రాలకి  చెప్పుకోతగ్గ షేర్లు కూడా రాకపోవడంతో బిజినెస్‌ పరంగా ఈ చిత్రానికి అంత క్రేజ్‌ ఏర్పడలేదు. అయితే ఈ చిత్రంపై అచంచలమైన నమ్మకం వున్న నిర్మాత మహేష్‌ కోనేరు ప్రత్యేక షో వేసి దిల్‌ రాజుకి చూపించాడు. దిల్‌ రాజుకి ఈ చిత్రం నచ్చడమే కాకుండా ఆడుతుందనే నమ్మకం కలిగిందట. అందుకే నైజాం, ఉత్తరాంధ్ర హక్కులు తీసుకుందామని అనుకున్న వాడే అవుట్‌రైట్‌గా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ ప్రదర్శన హక్కులు తీసేసుకున్నాడట.

నిర్మాతకి పెట్టుబడి తిరిగి వచ్చేసింది. లాభంగా ఇతర హక్కులు వుండనే వుంటాయి. దిల్‌ రాజు ఇలా అవుట్‌రైట్‌గా హక్కులు తీసుకున్న సినిమాల్లో చాలావరకు పెద్ద హిట్‌ అయ్యాయి. పటాస్‌ కూడా అలా తీసుకున్నదే. అలా చూస్తే 118కి అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English