దిల్ రాజు రుణం తీర్చుకుంటున్నాడా?

దిల్ రాజు రుణం తీర్చుకుంటున్నాడా?

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో అతి పెద్ద విజయాల్లో ‘పటాస్’ ఒకటి. ఐతే ఆ సినిమా రిలీజయ్యే ముందు అతడి పరిస్థితి ఏమీ బాగా లేదు. ‘పటాస్’ సినిమాను సొంత బేనర్లో తెరకెక్కించిన అతను.. బడ్జెట్ మీద పెద్దగా లాభం ఆశించకుండా సినిమాను దిల్ రాజుకు అప్పగించాడు. ఆ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన రాజు.. భారీగా లాభాలు చేసుకున్నాడు. ఐతే అప్పుడు కళ్యాణ్ రామ్ వల్ల బాగా లాభపడ్డ రాజు.. ఇప్పుడు అతడి రుణం తీర్చుకునే పనిలో పడ్డట్లు సమాచారం. ఈ నందమూరి హీరో కొత్త సినిమా ‘118’ను తన బేనర్ మీదే రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాడు రాజు.

‘పటాస్’ తర్వాత మళ్లీ గాడి తప్పిన కళ్యాణ్ రామ్.. వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. గత ఏడాది అతడి నుంచి వచ్చిన ‘నా నువ్వే’ డిజాస్టర్ కాగా.. ‘ఎమ్మెల్యే’ కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడతడి ఆశలన్నీ ‘118’ మీదే ఉన్నాయి. ‘నా నువ్వే’ను నిర్మించిన కళ్యాణ్ మిత్రుడు, పీఆర్వో మహేష్ కోనేరునే ఈ చిత్రాన్ని కూడా నిర్మించాడు. దీంతో ఈ సినిమా కళ్యాణ్‌కు మరింత కీలకం. ఈ స్థితిలో దిల్ రాజు సినిమాను టేకప్ చేయడం కలిసొచ్చే విషయమే. దిల్ రాజు కొన్న సినిమా అంటే ప్రేక్షకులకు కొంచెం ఎక్కువ నమ్మకం వస్తుంది. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కె.వి.గుహన్ రూపొందించిన ‘118’ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన నివేథా థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English