12 మంది సంతానం.. ఎన్టీఆర్ జవాబిది

12 మంది సంతానం.. ఎన్టీఆర్ జవాబిది

నందమూరి తారక రామారావు ఏకంగా 12 మంది పిల్లల్ని కన్నారు. నటుడిగా తిరుగులేని స్థాయిని అందుకుని జనాల ఆరాధ్య దైవంగా మారిన ఎన్టీఆర్.. ఇంతమంది సంతానాన్ని కనడంపై ఎప్పట్నుంచో విమర్శలున్నాయి. చదువుకోని, సమాజం గురించి తెలియని వాళ్లు ఇలా రెండంకెల సంఖ్యలో పిల్లల్ని కంటే ఓకే కానీ.. బాగా చదువుకుని.. తక్కువ వయసులోనే హీరోగా మంచి స్థాయిని అందుకుని.. సొసైటీలో మంచి పేరు సంపాదించిన ఎన్టీఆర్.. తనను కోట్లాది మంది అనుసరిస్తారని తెలిసి కూడా అంత మంది పిల్లల్ని కనడం సమంజసంగా అనిపించదు. ఐతే దీనిపై ఎన్టీఆర్ ఎప్పుడూ మాట్లాడింది లేదు. అప్పట్లో మీడియా కూడా ఇప్పట్లా విస్తృతం కాదు కాబట్టి ఎవరూ ఆయన్ని దీనిపై ప్రశ్నించలేకపోయి ఉండొచ్చు. ఐతే తన తండ్రిపై ఈ విషయంలో విమర్శలున్నాయి కాబట్టి.. దానికి ‘యన్.టి.ఆర్’ సినిమా ద్వారా సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు బాలయ్య.

శుక్రవారమే రిలీజైన ‘మహానాయకుడు’ సినిమాలో ఒక చోట తాను 12 మంది rnపిల్లల్ని ఎందుకు కనాల్సి వచ్చిందో ఎన్టీఆర్ చెప్పాడు. సినిమాలో ఒకచోట తన rnభార్య బసవతారకం గొప్పదనాన్ని ఎన్టీఆర్ చెబుతాడు. ఆమె తన కోసమే rnబతికిందన్నాడు. అప్పట్లో కుటుంబ నియంత్రణ ఉండేది కాదని.. ఎంతమంది సంతానం rnఉంటే అంత ఆస్తి ఉన్నట్లు భావించే వారమని.. తనకు ఓపిక ఉన్నంత వరకు బిడ్డల్నిrn కంటూనే ఉంటా అని తన భార్య పిల్లల్ని కంటూ వెళ్లిందని ఎన్టీఆర్ అంటాడు. rnబాలకృష్ణ చనిపోయాక ఇక సంతానం వద్దని అంటే.. చనిపోయిన తన పెద్ద కొడుకు rnరామకృష్ణ మళ్లీ పుడతాడనే ఉద్దేశంతో మళ్లీ బసవతారకం పిల్లల్ని కనడానికి rnసిద్ధమైందని ఎన్టీఆర్ చెబుతాడు. ఈ రకంగా ఎన్టీఆర్ మీద ఉన్న విమర్శకు rnసమాధానం చెప్పే ప్రయత్నం చేసింది బాలయ్య బృందం. ఐతే ఇలా ఎన్టీఆర్‌కు rnసంబంధించ ిన ప్రతి విషయాన్నీ సానుకూలంగా చూపించడం.. ఆయనలో చిన్న లోపం కూడా rnలేదన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడమే ‘యన్.టి.ఆర్’ సినిమాకు మైనస్ అవుతోందన్నది rnస్పష్టం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English