మహేష్ మల్టీప్లెక్స్.. ఏం మార్చలేదే

మహేష్ మల్టీప్లెక్స్.. ఏం మార్చలేదే

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య రాంగ్ రీజన్స్‌తో మీడియాలో హైలైట్ అయ్యాడు. కొన్ని నెలల కిందట మహేష్ ఏదో పన్ను విషయంలో అధికారులకు సహకరించలేదని.. చాలా ఏళ్లుగా పన్ను కట్టలేదని ఒక సమాచారం బయటికి వచ్చింది. దాని వల్ల అతను బాగా బద్నాం అయ్యాడు. ఇప్పుడేమో మహేష్ భాగస్వామిగా ఉన్న ఏఎంబీ మల్టీప్లెక్స్ నిబంధనలకు అనుగుణంగా పన్ను కట్టట్లేదని వార్తలొచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సినిమా టికెట్ల మీద వినోదపు పన్నును తగ్గించింది. కానీ ఆ మేరకు మహేష్ మల్టీప్లెక్స్ ధరలు తగ్గించలేదు. హైదరాబాద్‌లోని మిగతా మల్టీప్లెక్సులన్నీ ధరలు సవరించగా.. ఏఎంబీ మాత్రం యథాతథంగా టికెట్ల రేట్లు కొనసాగించింది. ఇలా చేయడం ద్వారా గత కొన్ని రోజుల్లో మహేష్ మల్టీప్లెక్స్ రూ.35 లక్షల రూపాయల దాకా ప్రేక్షకుల నుంచి అదనంగా వసూలు చేసినట్లు అధికారులు తేల్చారు. నోటీసులు ఇచ్చారు.

ఐతే ఏఎంబీ వాళ్లు అధికారులకు ఏమని బదులిచ్చారో.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారో తెలియదు. కానీ నోటీసులు వచ్చాక కూడా ఇందులో టికెట్ల రేట్లేమీ మారలేదు. మామూలుగా ఇలాంటి సందర్భాల్లో వెంటనే అప్రమత్తం అవుతారు. ఆల్రెడీ మహేష్ పేరు డ్యామేజ్ అవుతుండటంతో.. మరింత బద్నాం కాకుండా చూసుకుంటారు. కానీ ఏఎంబీ సినిమాస్ వాళ్లు అలా ఏమీ చేయలేదు.

యధావిధిగా రూ.200 రేటుతో టికెట్లు కొనసాగిస్తున్నారు. ఆన్ లైన్ బుకింగ్స్‌లో అవే రేట్లు చూపిస్తున్నాయి. థియేటర్ల దగ్గర కూడా అవే రేట్లతో టికెట్లు అమ్ముతున్నారు. మరి తామేమీ తప్పు చేయలేదని.. ఆ రేట్లు కరెక్టే అన్న ఉద్దేశంతో అవే ధరలు కొనసాగిస్తున్నారా.. లేక అధికారుల నోటీసుల్ని లెక్క చేయకుండా ఇలా చేస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు. తమకు వచ్చిన నోటీసులపై ఇంకా ఏఎంబీ వివరణ ఇస్తూ ప్రెస్ నోట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English