యన్.టి.ఆర్ ఫెయిల్యూర్.. బాలయ్య గప్ చుప్

యన్.టి.ఆర్ ఫెయిల్యూర్.. బాలయ్య గప్ చుప్

సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమాకు ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే. బయ్యర్లకు ఏకంగా రూ.50 కోట్ల నష్టం తెచ్చిపెట్టిందీ చిత్రం. విడుదలకు ముందు పాజిటివ్ బజ్, రిలీజ్ తర్వాత పాజిటివ్ రివ్యూలు, టాక్ తెచ్చుకున్న సినిమాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ ప్రభావం రెండో భాగం ‘మహానాయకుడు’ మీద బాగానే పడింది.

ఈ సినిమాను ప్రమోట్ చేయాల్సిన పరిస్థితుల్లో చిత్ర బృందం ఏం మాట్లాడుతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ స్థితిలో మీడియాను ఎదుర్కోవడం చిత్ర బృందానికి కష్టమే అనుకున్నారు. కానీ హీరో కమ్ ప్రొడ్యూసర్ నందమూరి బాలకృష్ణ సెలెక్టెడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ ఫలితం గురించి ప్రశ్న ఎందురైంది.

‘మహానాయకుడు’ ట్రైలర్లో ఉన్న డైలాగ్ నుంచే ఆ ప్రశ్న ఉత్పన్నమైంది. ‘మొదటి సినిమా ఆడలేదంట.. ఆ తర్వాతి సినిమాకు తిరుగులేదంట’ అంటూ ట్రైలర్లో వినిపించిన డైలాగ్ గురించి ప్రస్తావించి.. ఎన్టీఆర్ ఇలాంటి సెంటిమెంట్లను ఎంత వరకు ఫాలో అయ్యేవారు అని అడిగితే బాలయ్య చిత్రమైన సమాధానం ఇచ్చాడు. ‘‘నాన్నగారు అలా కాదు. ప్రతి పనినీ నిర్దిష్టమైన సంకల్పంతో చేసేవారు. అపజయానికి కుంగిపోవడం, విజయాలకి పొంగిపోవడం ఆయన చరిత్రలోనే లేదు. నాకూ అదే అలవాటైంది’’ అన్నాడు. అంతే తప్ప ‘కథానాయకుడు’ ఫెయిలవడం గురించి బాలయ్య సూటిగా ఏమీ సమాధానం చెప్పలేదు.

మరోవైపు ‘కథానాయకుడు’ వల్ల భారీగా నష్టపోయిన బయ్యర్లను ఆదుకోవడం గురించి బాలయ్య మాట్లాడాడు. తనకు కష్టం వస్తే బయ్యర్లు వాళ్ల కష్టం లాగా భావిస్తారని.. వాళ్లకు కష్టం వచ్చినా అది తన కష్టమే అవతుందని.. అందుకే నష్టపోయిన అందరికీ తగు రీతిలో న్యాయం చేయాలని నిర్ణయించుకున్నామని బాలయ్య చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English