కౌశల్ బిల్డప్ మామూలుగా లేదబ్బా..

కౌశల్ బిల్డప్ మామూలుగా లేదబ్బా..

‘బిగ్ బాస్’ రెండో సీజన్లో విజేతగా నిలిచి ఉండొచ్చు కానీ.. కౌశల్ వివిధ సందర్భాల్లో చేసిన అతి చూసి అతడిని అభిమానించేవారి కంటే కూడా వ్యతిరేకించేవాళ్లు ఎక్కువయ్యారు. ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఉండగానే పలుమార్లు అతడి తీరు వివాదాస్పదమైంది. ఇక బయటికి వచ్చాక అతను చేసిన అతి అంతా ఇంతా కాదు. తనకు విదేశీ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ఇస్తోందని.. తనకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని.. ఇలా చాలానే అతిశయోక్తి మాటలు మాట్లాడాడు. ఒక బుడగ లాంటి కౌశల్ ఆర్మీని చూసి చాలా గొప్పగా ఫీలైపోయిన తీరును పలుమార్లు చూశాం. ‘బిగ్ బాస్’ ముగిసిన కొన్ని రోజులకే కౌశల్‌ను జనాలు పట్టించుకోవడం మానేసినా.. అతను మాత్రం ఏదో ఒక రకంగా అటెన్షన్ కోసం ట్రై చేస్తూనే వచ్చాడు.

తాజాగా పుల్వామా ఉగ్రవాద దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశకాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది సెలబ్రెటీలు స్పందించి బాధిత కుటుంబాల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. ఐతే కౌశల్ ఒక అడుగు ముందుకేసి తన అభిమానులతో కలిసి క్యాండిల్ ర్యాలీ చేయాలనుకున్నాడు. ఇందుకోసం ఎక్కడ లేని ఎమోషన్ తెచ్చుకుని ఒక వీడియో మెసేజ్ పెట్టాడు. అందులో అతను చేసిన ఓవరాక్షన్ మామలుగా లేదు. క్యాజువల్‌గా విషయం చెప్పాల్సిన వాడు.. ఏదో కెమెరా ముందు యాక్షన్ చేస్తున్నట్లగా అతి చేశాడు. అతడి క్యాండిల్ ర్యాలీకి ఆశించిన స్పందన రాలేదు.

అందుకే దానికి సంబంధించిన ఫొటోలేమీ కూడా షేర్ చేయలేదు. మరోవైపు బాధిత కుటుంబాల కోసం 50 వేల విరాళం ప్రకటించిన కౌశల్.. దాన్ని తీసుకెళ్లి ఐజీకి ఇచ్చాడు. ఫొటోలు దిగాడు. ఓవైపు లక్షలు.. కోట్లు ఇస్తున్న వాళ్లు సైలెంటుగా సహాయ నిధికి డబ్బులు పంపిస్తుంటే.. కౌశల్ మాత్రం తన 50 వేలు పట్టుకెళ్లి ఐజీకి సమర్పించి భార్యతో కలిసి ఫొటో దిగి ప్రచారం చేసుకోవడం.. తనను ఐజీ యూత్ ఐకాన్ అని పొగిడాడని డబ్బా కొట్టుకోవడం అతి కాక మరేంటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English