'మహానాయకుడు' ఆఖరి అస్త్రం

'మహానాయకుడు' ఆఖరి అస్త్రం

కథానాయకుడు ఘోర పరాజయం కారణంగా ఎంతో క్రేజ్‌ వుంటుందని భావించిన 'మహానాయకుడు' అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్‌ అవుతోంది. అయితే ఈ భాగం ఖచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుందని నిర్మాతలకి గట్టి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ ఈ చిత్రానికి ప్రీమియర్‌ని హైదరాబాద్‌లో ఒక రోజు ముందుగా ప్లాన్‌ చేయడం జరిగింది. శుక్రవారం విడుదలవుతోన్న చిత్రానికి గురువారం సాయంత్రమే ప్రీమియర్‌ వేయడం వల్ల ఒక్కోసారి అనర్ధాలు జరిగే ప్రమాదముంది.

ఏమాత్రం టాక్‌ బాగా రాకపోయినా ఓపెనింగ్స్‌పై భారీ ప్రభావం వుంటుంది. అయినా కానీ ఈ చిత్రానికి తప్పకుండా మంచి టాక్‌ వస్తుందనే ధీమాతో దీనిని ఆఖరి అస్త్రంగా ఎన్టీఆర్‌ బృందం ప్రయోగిస్తోంది. మహేష్‌బాబుకి చెందిన ఎఎంబి థియేటర్లలో గురువారం సాయంత్రం ప్రీమియర్‌ పడుతుంది. ఆ షో నుంచి పాజిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయితే శుక్రవారం మార్నింగ్‌ షో పడేసరికి మహానాయకుడుకి ఊపు వస్తుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా, చివరకు అభిమానులు కూడా అంతగా ఆసక్తి చూపించని వేళ వస్తోన్న చిత్రానికి ఈ ఎత్తు ఫలిస్తే బాగానే ప్లస్‌ అవుతుంది. మరి ఏమి జరుగుతుందనేది తెలుసుకోవడానికి కొద్ది గంటలు ఆగాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English