మహేష్ ఆ 30 లక్షలు ఏం చేస్తాడు?

మహేష్ ఆ 30 లక్షలు ఏం చేస్తాడు?

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ప్రతికూల కారణాలతో వార్తల్లో నిలిచాడు. అతను భాగస్వామిగా ఉన్న ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రేక్షకుల నుంచి ఎక్కువ మొత్తం టికెట్ రూపేణా వసూలు చేయడం వివాదాస్పదమవుతోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సినిమా టికెట్లపై పన్నును తగ్గించిన సంగతి తెలిసిందే. రూ.100కు పైగా ఉన్న టికెట్‌పై పన్నును 28 నుంచి 18 శాతానికి.. రూ.100 లోపు టికెట్ మీద పన్నును 18 నుంచి 12 శాతానికి తగ్గించింది.

ఈ మేరకు టికెట్ల రేట్లను కూడా థియేటర్లను తగ్గించాయి. మల్టీప్లెక్సుల్లో రూ.150గా ఉన్న టికెట్ రేటు రూ.138కి తగ్గింది. మిగతా రేట్ల టికెట్లపై ఆ మేరకు ధర తగ్గించారు. హైదరాబాద్‌లో దాదాపుగా అన్ని మల్టీప్లెక్సులూ రేట్లు తగ్గించాయి. కానీ మహేష్ బాబు ఆధ్వర్యంలోని ఏఎంబీ సినిమాస్ మాత్రం నిబంధనల్ని పట్టించుకోలేదు.

ఇక్కడ టికెట్ రేటు మినిమం రూ.200గా ఉంది. జీఎస్టీ తగ్గాక కూడా యధావిధిగా టికెట్ల రేట్లను కొనసాగించారు. గత రెండు వారాల్లో ఈ రకంగా అదనంగా రూ.30 లక్షలు వసూలు చేసింది యాజమాన్యం. ఐతే మిగతా థియేటర్లలో రేట్లు తగ్గించి ఈ థియేటర్లో మాత్రం అలాగే కొనసాగించడంపై ఎవరో జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించుకుని నోటీసులు ఇచ్చారు.

ఆల్రెడీ పన్ను విషయంలో మహేష్ అవకతవకలకు పాల్పడినట్లు ఈ మధ్యే ఒక న్యూస్ బయటికి వచ్చింది. అతడికి అధికారులు నోటీసులిచ్చారు. కొన్ని రోజుల పాటు మహేష్ ఈ విషయంతో మీడియాలో హైలైట్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఇలాంటి వార్తతో జనాల నోళ్లలో నానడం అతడికి ఇబ్బందికరమే. ఐతే మహేష్ మల్టీప్లెక్స్ నిబంధనలు ఉల్లంఘించినట్లు స్పష్టమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English