బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు

బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు

కాస్త డిఫరెంట్ స్టోరీ అయినా నో అనకుండా చేసేద్దాం అనే హీరోల్లో  రానా ఒకరు. ఈ మల్టి టాలెంటెడ్ యక్టర్ కథకు తనవంతు సహాయంగా క్యారెక్టర్ ఎలివేషన్ తో కథను మరింత డిఫరెంట్ గా మార్చగలడు. దర్శకుల బ్యాక్ గ్రౌండ్ కెరీర్ ఏమిటని అస్సలు చూడడు. అవసరమైతే తన సలహాలతో మార్పులు చేయమని కథ సెట్స్ పైకి వెళ్ళాక డైరెక్టర్ కి సరెండర్ అయిపోతాడు. అందుకే ఎక్కడ డిఫరెంట్ కథ పుట్టినా ముందుగా దర్శకులకు రానానే గుర్తొస్తున్నాడు.

మణిరత్నం శిష్యుడు మిలింద్ రావ్ కూడా ఇప్పుడు బాహుబలి విలన్ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. మిలింద్ రెండేళ్ల కిందట సిద్దార్థ్ తో గృహం అనే హారర్ మూవీని తెరకెక్కించాడు. చాలా కాలం తరువాత సిద్దార్థ్ గురించి మళ్ళీ అన్ని భాషల ప్రేక్షకులు ఒకేసారి మాట్లాడుకునేలా చేసింది ఆ సినిమా. ఇప్పుడు రానాతో కూడా ఇక కొత్త సబ్జెక్ట్ ని తెరకెక్కించడానికి మిలింద్ సిద్ధమవుతున్నాడు. అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే వచ్చింది. రీసెంట్ గా దర్శకుడు కథకు ఫైనల్ టచ్ ఇచ్చాడు. ఇపుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అవుతున్నాడు. అయితే గృహం సినిమాతో భయపెట్టిన మిలింద్ రానా తో కూడా అలాంటి జానర్ ని టచ్ చేస్తాడా అని ఆడియెన్స్ లో అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి.

మరి రానా బయపెడతాడో లేక థ్రిల్ చేస్తాడో చూడాలి. ప్రస్తుతం రానా హాథి మేరా సాతి అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా మూడు భాషల్లో తెరకెక్కుతోంది. అలాగే  హిరణ్యకశిప స్క్రిప్ట్ డిస్కషన్లలో కూడా దర్శకుడు గుణశేఖర్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడు. మొత్తానికి రానా మూడు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ లైన్లో పెట్టాడు. అలాగే అనుష్క సైలెన్స్ లో కూడా ఒక చిన్న రోల్ పోషిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English