అర్జున్‌ రెడ్డి రాలేదు కానీ అతడిని ఇచ్చాడు

అర్జున్‌ రెడ్డి రాలేదు కానీ అతడిని ఇచ్చాడు

ఆగిపోయిన 'అర్జున్‌ రెడ్డి' తమిళ రీమేక్‌ని కూడా ఒరిజినల్‌ తీసిన సందీప్‌ వంగా చేతిలో పెట్టడానికి చేసిన ప్రయత్నాల గురించి తెలిసిందే. అయితే ఆల్రెడీ హిందీ రీమేక్‌ని డైరెక్ట్‌ చేస్తోన్న సందీప్‌ మరోసారి అదే కథ డైరెక్ట్‌ చేయడానికి ఇష్టపడలేదు. విక్రమ్‌ వైపు నుంచి ప్రెజర్‌ బాగా వచ్చినా, మంచి ఆఫర్‌ ఇచ్చినా కూడా సందీప్‌ చేయనని చెప్పేసాడు. అయితే అర్జున్‌రెడ్డి రూపకల్పనలో తనతో మొదట్నుంచీ వుండి, ఆ చిత్రం అంత బాగా రావడానికి తోడ్పాటునిచ్చిన తన అసోసియేట్‌ డైరెక్టర్‌ గిరీశాయని తమిళ నిర్మాతలకి అప్పగించాడు.

గిరీశాయ అయితే అర్జున్‌ రెడ్డి సోల్‌ మిస్‌ అవకుండా తీస్తాడని చెప్పి తన సహాయక దర్శకుడికి దర్శకుడి హోదా కల్పించాడు. విక్రమ్‌ కూడా ఈ ఛాయిస్‌తో సంతృప్తి చెందాడు. తమిళ చిత్రం పేరు వర్మ నుంచి ఆదిత్య వర్మగా మార్చేయడమే కాకుండా అర్జున్‌ రెడ్డి ఫస్ట్‌ పోస్టర్‌ని, టైటిల్‌ ఫాంట్‌ని తలపించేలా పోస్టర్‌ డిజైన్‌ చేసి వదిలారు. అర్జున్‌రెడ్డి పోస్టర్‌లో విజయ్‌ దేవరకొండ లుక్‌తో పోల్చి చూస్తే ధృవ్‌ విక్రమ్‌ తేలిపోతున్నాడు కానీ మునుపటి ఫస్ట్‌ లుక్‌తో పోలిస్తే ఇదే నయమనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English