చాప కింద నీరులా... సూపర్‌స్టార్‌గా!

చాప కింద నీరులా... సూపర్‌స్టార్‌గా!

రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా పరిచయం అయిన కొత్తల్లో అతను కూడా ఒక మీడియం రేంజ్‌ యాక్టర్‌ అవుతాడని, యాభై, అరవై కోట్ల సినిమాలు చేసుకుంటాడని అనుకున్నారు. కొంతకాలం అతని ప్రస్థానం అలాగే సాగింది. అయితే సంజయ్‌లీలా భన్సాలీ చేతిలో పడి రణ్‌వీర్‌సింగ్‌ స్టార్‌ అయిపోయాడు. రామ్‌లీలా చిత్రంతో తొలిసారి బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటుకున్న రణ్‌వీర్‌సింగ్‌ ఆ తర్వాత కథల ఎంపికలో తనదైన శైలి కనబరుస్తూ వస్తున్నాడు. ఒకే తరహా పాత్రలకి, పోకడలకి ఫిక్స్‌ అయిపోకుండా అటు మసాలా సినిమాలు, ఇటు కల్ట్‌ సినిమాలు కూడా చేసేస్తున్నాడు.

రణ్‌వీర్‌సింగ్‌కి అంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ లేకపోవడంతో అతనేది చేసినా జనం చూస్తున్నారు. అతనిపై ప్రత్యేకమైన అంచనాలతో రాకుండా కథ, వినోదం కోసమే వస్తున్నారు. దీంతో రణ్‌వీర్‌ సింగ్‌ చిత్రాలపై స్టార్‌డమ్‌ అనే భారం పడడం లేదు. పద్మావత్‌, సింబా చిత్రాలు భారీ విజయాలు సాధిస్తే... 'గల్లీబాయ్‌' కూడా ఫుల్‌ రన్‌లో, ఇండియాలో నూట యాభై కోట్ల నెట్‌ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అమీర్‌ ఖాన్‌ తలాష్‌ చేసినా, షారుక్‌ 'ఫాన్‌' చేసినా ఇలాంటి స్పందన రాలేదు. కల్ట్‌ సినిమాతోను కమర్షియల్‌ సక్సెస్‌ సాధించిన రణ్‌వీర్‌సింగ్‌ సూపర్‌స్టార్‌ అయ్యే దిశగా మరో అడుగు ముందుకు వేసాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English