సైలెంట్‌గా వుండమన్న బాలకృష్ణ

సైలెంట్‌గా వుండమన్న బాలకృష్ణ

'ఎన్టీఆర్‌' బయోపిక్‌ రెండవ భాగం 'మహానాయకుడు' శుక్రవారం విడుదలవుతున్నా ఇంతవరకు పబ్లిసిటీ పరంగా ఎలాంటి హంగామా లేదు. బాలకృష్ణ, క్రిష్‌ కూడా ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇంటర్వ్యూలు కూడా ఇవ్వబోమని పీఆర్‌ టీమ్‌కి చెప్పేసారట. కేవలం ట్రెయిలర్‌ మినహా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి హంగామా లేదు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని అనంతపూర్‌లో చేయాలని మొదట భావించినా కానీ బాలకృష్ణ వద్దని చెప్పారట. మొదటి భాగం పరాజయం నేపథ్యంలో ఎంత ప్రచారం చేసినా వృధా ప్రయాస అవుతుందనేది ఆయన భావన అట.

సినిమా విడుదలయిన తర్వాత టాక్‌ బాగా వస్తే కనుక అప్పుడు పబ్లిసిటీ చేద్దామని, సక్సెస్‌ ఈవెంట్‌ ఘనంగా బహిరంగ వేదికపై ప్లాన్‌ చేద్దామని చెప్పారట. అంచేత ఈ చిత్రానికి ఎలాంటి పబ్లిసిటీ హంగామా వుండదట. మొదటి భాగం కేవలం సినిమా వినోదానికి పరిమితం కావడంతో, రెండవ భాగంలో ఎన్టీఆర్‌ పొలిటీషియన్‌గా సాధించిన విజయాలు, ఎదుర్కొన్న వెన్నుపోట్లు నేపథ్యంలో డ్రామా బాగా క్లిక్‌ అవుతుందని, ఈ చిత్రాన్ని అభిమానులు, రాజకీయ వార్తల పట్ల ఆసక్తి వున్న వారు తప్పక ఆదరిస్తారని 'ఎన్టీఆర్‌' బృందం విశ్వసిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English