తమన్నా దెబ్బకి శ్రియ అవుట్

తమన్నా దెబ్బకి శ్రియ అవుట్

మరో రెండేళ్లు గడిస్తే శ్రియ శరన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కరెక్ట్ గా 20 ఏళ్ళు పూర్తిచేసుకుంటుంది. 2001లో ఇష్టం సినిమాతో పరిచయమైన ఈ క్యూట్ హీరోయిన్ సౌత్ లో అందరికి ఇష్టమైన హీరోయిన్ గా మారింది. రజినీకాంత్ శివాజీ సినిమా వరకు ఆమె కెరీర్ ఒక రేంజ్ లో నడిచింది. తరువాతి సంగతి తెలిసిందే. ఇక సీనియర్ హీరోలు మొన్నటి వరకు ఈ బ్యూటీనే ఫస్ట్ ఛాయిస్ గా తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్.

శ్రియ వైపు మొగ్గు చూపే హీరోలు చాలా వరకు తగ్గిపోవడమే కాదు.. ఆమె ప్లేస్ కి నేటితరం కుర్ర హీరోయిన్లు గట్టిగానే ఎసరు పెట్టేశారు. రీసెంట్ గా వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా వెంకీ మామా లో శ్రియతో నటించాలని అనుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఆమెను కన్ఫామ్ కూడా చేశారు. అయితే అవతల F2 తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడంతో వెంకీ మామ మైండ్ చేంజ్ అయ్యిందట. తమన్నా లాంటి హీరోయిన్ అయితే బావుంటుందని చిత్ర యూనిట్ తో చెప్పారట. దానితో ఆ తరహాలో అందచందాలు ఆరబోసే నవచందనం ఎవరున్నారంటూ వెతికేసి.. వెంకీ మామలో ఇప్పుడు వెంకీ సరసన ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ని ఫిక్స్ చేయడం జరిగిందట.

మొత్తానికి తమన్నా దెబ్బకి శ్రియ అవుట్ అన్నట్లు అనుకోవాల్సిందే. ఇన్నేళ్ల వరకు ఎలాగోలా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న అమ్మడు సడన్ గా మరో హీరోయిన్ గ్లామర్ డోస్ వల్ల దురదృష్టవశాత్తు హీరోల్లో రేంజ్ తగ్గిపోయింది. ప్రస్తుతం శ్రీయ నరగసూరన్ అనే తమిళ్ సినిమాతో పాటు తడ్క అనే హిందీ సినిమాలో నటిస్తోంది. మరి ఆ సినిమాలతో అయిన అమ్మడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English