కలెక్షన్లు లేవు బాబోయ్..

కలెక్షన్లు లేవు బాబోయ్..

తెలుగు సినిమాలకు కష్ట కాలం వచ్చింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోతోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు సినిమాలకు గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్-2’ మినహాయిస్తే కొత్త ఏడాదిలో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించిన సినిమానే లేదు. ఆ సినిమా కాసుల పంట పండించింది. కానీ కొన్ని వారాల పాటు ఆ సినిమా తప్ప మరే సినిమా ఏదీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. ముందు, వెనుక వారాల్లో వచ్చిన సినిమాలన్నీ తేలిపోయాయి. రాను రాను పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది తప్ప.. బాక్సాఫీస్‌కు కళ తెచ్చే సినిమానే కనిపించడం లేదు. ఒక నెల రోజుల వరకు ‘ఎఫ్-2’ బాక్సాఫీస్‌ను నిలబెడుతూ వచ్చింది కానీ.. ఇప్పుడు ఆ సినిమా జోరు కూడా తగ్గిపోయింది. ఆ చిత్రం ఆల్రెడీ అమేజాన్ ప్రైంలోకి వచ్చేసింది.

పైరసీలో మంచి ప్రింటు దొరుకుతోంది. ఇక థియేటర్లకు జనాలెలా వస్తారు? ఇక చివరగా గత వారం వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులకు పెద్ద షాకే ఇచ్చాయి. ‘దేవ్’తో పాటు ‘లవర్స్ డే’ తుస్సుమనిపించాయి. వీకెండ్లో కూడా ఈ సినిమాలకు వసూళ్లు లేవు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లూ వెలవెలబోతున్నాయి. వీక్ డేస్‌లో ఎక్కడా 20 శాతం ఆక్యుపెన్సీ కూడా దాటట్లేదు. మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు.. అన్నింట్లోనూ అదే పరిస్థితి. ఫిబ్రవరి, మార్చి నెలలంటే మామూలుగానే అనస్ సీజన్. అందులోనూ ఈసారి సరైన సినిమాలు లేక పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. వేసవి సినిమాలు వచ్చే వరకు పరిస్థితిలో గొప్ప మార్పయితే వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English