క్రిష్ ఎన్టీఆర్ కన్నా వర్మ ఎన్టీఆర్ ఆరు రెట్లు

క్రిష్ ఎన్టీఆర్ కన్నా వర్మ ఎన్టీఆర్ ఆరు రెట్లు

రామ్ గోపాల్ వర్మ ఆనందం మామూలుగా లేదిప్పుడు. గత ఏడాది బాలయ్య అండ్ కో ఎన్టీఆర్ మీద సినిమా అనౌన్స్ చేసిన తర్వాత.. వర్మ కూడా మరో యాంగిల్లో ఎన్టీఆర్ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించినపుడు అతడిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. బాలయ్య తీసే ‘యన్.టి.ఆర్’ ముందు వర్మ ప్రకటించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిలవలేదనే అనుకున్నారంతా. కానీ గత కొన్ని నెలల్లో కథ మొత్తం మారిపోయింది. బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన ‘యన్.టి.ఆర్’లో ఒక పార్ట్ తుస్సుమంది. రెండో పార్ట్ పరిస్థిితి కూడా అయోమయంగా ఉంది. అదే సమయంలో వర్మ నుంచి రానున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ జనాల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. దీని ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నాడు. ఈలోపు ‘యన్.టి.ఆర్’ టీంను అదే పనిగా గిల్లుతున్నాడు వర్మ.

తాను తీస్తున్నదే అసలైన ఎన్టీఆర్ సినిమా అని.. దాన్నే జనాలు నమ్ముతున్నారని వర్మ ముందు నుంచి చెబుతున్నాడు. ఈ విషయాన్ని రుజువు చేయడానికి ట్విట్టర్లో ఒక పోల్ కూడా నిర్వహించాడు వర్మ. రెండు ఎన్టీఆర్ సినిమాల్లో ఏది ఒరిజినల్ అని మీరు భావిస్తున్నారంటూ పోల్ పెట్టాడాయన. దాదాపు 42 వేల మంది పోల్‌లో పాల్గొనగా అందులో 85 శాతం మంది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కే ఓటేశారు. క్రిష్ తీసిన ‘యన్.టి.ఆర్’ సినిమా ఒరిజినల్ అని కేవలం 15 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. ట్విట్టర్ పోల్‌ విషయంలో మానుపులేషన్స్ ఏమీ ఉండవు. అది చాలా ఫెయిర్‌గానే ఉంటుంది. వర్మ ఊరికే డబ్బా కొట్టుకోవడం కాదు కానీ.. నిజంగానే జనాలు అతడి సినిమా మీదే ఎక్కువ ఆసక్తితో ఉన్నారు.. అందులోనే ఎక్కువ నిజాలు ఉన్నాయని భావిస్తున్నారనడానికి ఈ పోల్ ఫలితాలే ఉదాహరణ. మామూలుగానే అతి చేసే వర్మ.. ఇలాంటి తీర్పు వస్తే ఇక ఊరుకుంటాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English