బోయపాటి ఆటలు సాగడం లేదు

బోయపాటి ఆటలు సాగడం లేదు

'వినయ విధేయ రామ' విడుదలకి ముందు వరకు బోయపాటి శ్రీను చాలా మంది స్టార్‌ హీరోలకి మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్‌. ఆ సినిమా విడుదలయ్యేవరకు ప్రతి స్టార్‌ హీరో 'మస్ట్‌ డూ' లిస్ట్‌లో బోయపాటి శ్రీను ప్రాజెక్ట్‌ ఖచ్చితంగా వుండేది. కానీ ఆ సినిమా ఘోరమైన పరాజయం పాలయిన తర్వాత బోయపాటి ఛరిష్మా బాగా తగ్గిపోయింది. మాస్‌ డైరెక్టర్లు ఎప్పుడూ చేసేది రోప్‌ మీద వాకే. కాస్త పట్టు తప్పినా ప్రమాదం దారుణంగా జరుగుతుంది. అంతవరకు వారి పోకడలు నచ్చని వారంతా అమాంతం టార్గెట్‌ చేసేసి ట్రోల్‌ చేసేస్తారు. ఈ చిత్రంతో బోయపాటి కూడా తన ట్రోలర్స్‌కి దొరికేసాడు.

ఇంతకాలం తాను ఆడింది ఆటగా వున్న బోయపాటికి ఇప్పుడు అడిగిందల్లా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు. బాలకృష్ణతో చేద్దామనుకుంటోన్న సినిమాకి డెబ్బయ్‌ కోట్ల బడ్జెట్‌ అడిగాడట. ఇరవై కోట్లు కేవలం పోరాట దృశ్యాలకే కావాలని అన్నాడట. అయితే అందుకు బాలకృష్ణ ఒప్పుకోలేదట. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ కలుపుకున్నా తమ చిత్రం బిజినెస్‌ యాభై కోట్ల రేంజిలోనే వుంటుంది కనుక అంతలోనే ఈ చిత్రం చేయాలని అల్టిమేటం ఇచ్చాడట. దీంతో ఆ బడ్జెట్‌కి తగ్గట్టుగా తన విజన్‌ని బోయపాటి కుదించుకోవాల్సి వస్తోంది. ఈ చిత్రంతో కనుక బోయపాటి మిస్‌ఫైర్‌ అయితే వైవిఎస్‌ చౌదరి, శ్రీను వైట్ల మాదిరిగా పూర్తిగా వెనకబడే ప్రమాదం పొంచి వుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English