బ్లాక్‌బస్టర్‌ హీరోని సైడ్‌ చేసేసారుగా

బ్లాక్‌బస్టర్‌ హీరోని సైడ్‌ చేసేసారుగా

'ఆర్‌ ఎక్స్‌ 100'తో తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ సాధించాడు కార్తికేయ. నటన పరంగా మెప్పించలేకపోయినా యూత్‌లో 'ఆర్‌ఎక్స్‌100' సినిమా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే గుర్తింపు ఆధారంగా ఇప్పుడతను పలు చిత్రాల్లో అవకాశాలు పొందాడు. అయితే మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాల్లో కార్తికేయని ఇంకా 'హీరోగా' చూడడం లేదు. నాని హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కార్తికేయకి సైడ్‌ రోల్‌ ఇచ్చారు. ఈ పాత్ర చేయాలా వద్దా అనే దానిపై చాలా ఆలోచించి, నాని సినిమాకి వుండే రీచ్‌ వల్ల తనకి వైడ్‌ రికగ్నిషన్‌ వస్తుందని కార్తికేయ ఈ ఆఫర్‌ ఓకే చేసాడు.

అయితే దీని వల్ల అతనికి ఎంత బెనిఫిట్‌ వుంటుందనేది వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఎవరైనా స్టార్‌ హీరో సినిమాలో సైడ్‌ రోల్‌ చేసిన నటులకి అది అంతగా హెల్ప్‌ అయిన దాఖలాలు లేవు. ఉదాహరణకి నవదీప్‌ లాంటి వాళ్లు అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌తో నటించినా కానీ వారి సోలో హీరో సినిమాలకి అదేమంత ప్లస్‌ అవలేదు. మరి నానితో చేస్తోన్న ఈ చిత్రంతో తన మార్కెట్‌ బూస్ట్‌ అవుతోందని ఆశిస్తోన్న కార్తికేయకి ఏదైనా డిఫరెంట్‌ రిజల్ట్‌ వస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English