ఎన్టీఆర్‌ ఎంత రికవర్‌ చేస్తాడు?

ఎన్టీఆర్‌ ఎంత రికవర్‌ చేస్తాడు?

'ఎన్టీఆర్‌' బయోపిక్‌ ద్వితీయ భాగంపై ఆసక్తిని రేకెత్తించడంలో టీమ్‌ ఇంతవరకు విఫలమయింది. విడుదలకి మరో మూడు రోజులు వుండగా, కనీసం ఇప్పుడయినా ఏదయినా మ్యాజిక్‌ చేసి ఇది చూసి తీరాలని అనిపించేలా చేయగలరో లేదో? ఎన్టీఆర్‌ చిత్రంపై నందమూరి అభిమానులకి ఎన్ని ఆశలున్నాయో, లేక ఇంకెవరికి అయినా ఎన్ని అంచనాలున్నాయో తెలియదు కానీ ఈ చిత్రం బయ్యర్లకి అయితే ఈ చిత్రంతో నష్టాన్ని ఎంత రికవర్‌ చేసుకోగలమనే ఉత్కంఠ ఎక్కువయింది.

ఆల్రెడీ మొదటి భాగం నష్టాల్లో మూడొంతుల్లో ఒక వంతు తాను భరిస్తానని బాలకృష్ణ మాట ఇచ్చాడు. మిగతా నష్టాన్ని ఈ రెండవ భాగానికి వచ్చే షేర్లలో నలభై శాతం ఇచ్చి భర్తీ చేస్తానని అన్నాడు. అలా జరగాలంటే మహానాయకుడు బ్రహ్మాండంగా ఆడాలి. కానీ ప్రస్తుతమున్న బజ్‌తో, ట్రెయిలర్‌కి వచ్చిన రియాక్షన్‌తో బేరీజు వేస్తే దీనికి ఎంత వసూళ్లు వస్తాయనేది అభిమానులకి సయితం కలవరంగానే వుంది. సినిమాలో ఏమి వుంటుందనేది ట్రెయిలర్‌లో మొత్తం చూపించేయడంతో తటస్థులకి అయితే ఈ చిత్రం చూడాలనే కోరిక కలగలేదు. కేవలం ఎన్టీఆర్‌ డైహార్డ్‌ ఫాన్స్‌ మాత్రమే ఇందులో తమ లీడర్‌ని ఎలా చూపించారు, ఎంత ఎలివేట్‌ చేసారనే అంశాలపై ఎగ్జయిట్‌ కావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English