క్రేజీ మూవీ మొదలైందహో..

క్రేజీ మూవీ మొదలైందహో..

హిట్ల మీద హిట్లు కొట్టి అలసిపోయిన యువ కథానాయకుడు నాని.. గత ఏడాది ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ సినిమాలతో కంగు తిన్నాడు. ఐతే ఆ పరాజయాల నుంచి వెంటనే బయటపడి క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టాడు. అందులో ఒకటి ‘జెర్సీ’. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసిన నాని.. సోమవారం తన కొత్త సినిమాను మొదలుపెట్టాడు. విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది.

ఈ క్రేజీ మూవీ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఒక పెద్ద స్టార్ సినిమా స్థాయిలో హంగామా కనిపించింది ఈ వేడుకలో. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నాని సరసన ఏకంగా ఐదుగురు కథానాయికలు నటించబోతున్నారు. ఇప్పటివరకు కీర్తి సురేష్, మేఘా ఆకాష్, ప్రియ ప్రకాష్ వారియర్‌ల పేర్లు ఖరారైనట్లుగా వార్తలొచ్చాయి. ఐతే ప్రారంభోత్సవంలోో ఈ ముగ్గురిలో ఎవరూ పాల్గొనలేదు. ఒక కొత్తమ్మాయి కనిపించింది. తన వివరాలు తెలియరాలేదు.

లెజెండరీ సినిమాటోోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూర్చబోతుండటం విశేషం. ఆయన ఇంతకుముందు విక్రమ్ సినిమా ‘13 బి’కి పని చేశాడు. శ్రీరామ్ రాకతో ఈ సినిమా రేంజే మారిపోయిందనే చెప్పాలి. ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ ఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా కనిపించబోతుండటం మరో ఆకర్షణ. ఇందులో నాని కుర్రాడిగా.. మధ్య వయస్కుడిగా.. ముసలివాడిగా.. మూడు భిన్నమైన అవతారాల్లో కనిపిస్తాడట. తెలుగులో ఇప్పటిదాకా రాని కొత్త తరహా కథతో సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ‘హలో’తో గట్టి ఎదురు దెబ్బ తిన్న విక్రమ్.. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. తర్వాత నానికి ఫిక్సయ్యాడు.

మంచి అభిరుచి ఉన్న దర్శకుడైన విక్రమ్, గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న నానిల కలయికలో సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమాకు ఎంపికైన మిగతా నటీనటులు, టెక్నీషియన్లు కూడా సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English