రామ్‌ చరణ్‌ స్కెచ్‌ రెడీ అవుతోంది

రామ్‌ చరణ్‌ స్కెచ్‌ రెడీ అవుతోంది

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగా మల్టీస్టారర్‌కి సంబంధించి ఇంతవరకు అఫీషియల్‌గా ఏ డీటెయిల్స్‌ బయటకి రాలేదు. అయితే అనధికారిక సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చరణ్‌ బ్రిటిష్‌ అధికారిగా నటిస్తున్నాడని, ఎన్టీఆర్‌ బందిపోటు నాయకుడిగా కనిపిస్తాడని ప్రచారంలో వుంది. ఈ వార్తలని ఇంతవరకు రాజమౌళి కానీ, ఇద్దరు హీరోలు కానీ ఖండించలేదు. ఈ చిత్రం గురించి ఏమి అడిగినా దాని గురించి మాట్లాడ్డానికి ఇంకా సమయం వుందని చెప్పి దాట వేసేస్తున్నారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి ఒక అఫీషియల్‌ పోస్టర్‌ బయటకి వస్తుందని, అది కూడా ఇద్దరు హీరోల్లో ఒకరి ఫస్ట్‌ లుక్‌ అని తెలిసి ఫాన్స్‌ ఎక్సయిట్‌ అవుతున్నారు. ఇద్దరు హీరోల్లో ముందుగా చరణ్‌ బర్త్‌డే వస్తోంది కనుక ముందుగా అతని ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తారని, ఇందుకోసం రెండు, మూడు క్యారెక్టర్‌ పోస్టర్లు సిద్ధం చేయిస్తున్నారని సమాచారం. చరణ్‌ క్యారెక్టర్‌ రివీల్‌ చేసేలా ఫస్ట్‌ లుక్‌ వుండాలా, లేక అతని క్యారెక్టర్‌ ఏమిటో తెలియనివ్వని విధంగా లుక్‌ విడుదల చేయాలా అనే దానిపై ఇంకా నిర్ణయానికి రాలేదట. మార్చి 27న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'కి సంబంధించి మొదటి పోస్టర్‌ అఫీషియల్‌గా బయటకి వస్తోందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English