హ్యాండిచ్చేసిన బోయపాటి!

హ్యాండిచ్చేసిన బోయపాటి!

'వినయ విధేయ రామ' పరాజయానికి బాధ్యత వహిస్తూ తన వంతుగా అయిదు కోట్ల రూపాయల పారితోషికాన్ని చరణ్‌ తిరిగి ఇవ్వగా, తన వాటాగా నిర్మాత దానయ్య కూడా అయిదు కోట్లు తిరిగి చెల్లించారట. ఈ సినిమాతో అత్యధికరగా ఆర్జించిన వారిలో చరణ్‌, దానయ్యతో పాటు బోయపాటి శ్రీను కూడా వుండడంతో అతను కూడా అయిదు కోట్లు ఇస్తే బాగుంటుందని అతనితో చర్చించారట. అయితే ఈ సెటిల్‌మెంట్‌ వ్యవహారం నిర్మాత, దర్శకుడి మధ్య వాగ్యుద్ధానికి దారి తీసిందనే పుకార్లు వినిపించాయి. మధ్యవర్తులుగా కూర్చున్న దిల్‌ రాజు లాంటి వాళ్లు నచ్చచెప్పడంతో కోటి రూపాయలు వెనక్కి ఇచ్చేందుకు బోయపాటి అంగీకరించాడని అన్నారు.

అయితే దానయ్యతో వచ్చిన విబేధాల కారణంగా అసలు పైసా కూడా తిరిగి ఇచ్చేది లేదని బోయపాటి తేల్చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడిగా తాను పని చేసిన దానికి పారితోషికం తీసుకున్నానని, నిర్మాణం, లాభ నష్టాలు అనేవి పూర్తిగా నిర్మాతకి సంబంధించిన విషయాలని చెబుతూ నష్ట పరిహారం ఇవ్వనని తెగేసి చెప్పాడట. ఇదిలావుంటే బోయపాటికి అడ్వాన్సులు ఇచ్చిన కొందరు నిర్మాతలు అతడినుంచి వాపసు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ ఒక స్టార్‌ హీరో డేట్స్‌ తెచ్చి సినిమా చేయడం తన పూచీ అని చెప్పి బోయపాటి డబ్బులు వెనక్కి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని కూడా వదంతులు వ్యాపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English