సీనియర్లతో సెటిలైపోయేలా ఉందే..

సీనియర్లతో సెటిలైపోయేలా ఉందే..

ఒకప్పుడైతే 20 ఏళ్లు కూడా నిండని శ్రీదేవి.. 60 ఏళ్లు పైబడ్డ ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో ఆడి పాడేసింది. కానీ ఇప్పటి రోజులు అలా లేవు. మంచి పారితోషకం ఇస్తామన్నా కూడా యంగ్ హీరోయిన్లు సీనియర్ హీరోల సరసన నటించే పరిస్థితి లేదు. ఒకసారి వయసు మళ్లిన హీరోతో నటిస్తే.. ఆ తర్వాత యంగ్ హీరోల పక్కన ఛాన్సులు రావేమో అన్న భయం వాళ్లది.

వయసు అంతరం మరీ ఎక్కువ ఉంటే చూసే ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకుని దర్శకులు కూడా సీనియర్ హీరోల పక్కన యువ కథానాయికల్ని తీసుకోవట్లేదు. ఈ నేపథ్యంలో 60 ప్లస్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం కష్టమవుతోంది.

తెలుగులో ఉన్న సీనియర్ హీరోలందరిలోకి ఎక్కువ ఛార్మింగ్‌గా, ఫిట్‌గా కనిపించే అక్కినేని నాగార్జునకు సైతం ఈ సమస్య ఉంది. ఆయన గత సినిమాలకు హీరోయిన్ల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాల్సి వచ్చింది. దక్షిణాదిన పేరున్న యంగ్ హీరోయిన్లలో నాగ్ సరసన నటించింది ఒక్క లావణ్య త్రిపాఠి మాత్రమే.

ఐతే ఇప్పుడు లావణ్య కన్నా చిన్నది, సినిమాల్లో జూనియర్ అయిన పాయల్ రాజ్ పుత్.. నాగార్జునకు జోడీగా నటించబోతుండటం విశేషమే. ఆమె ‘మన్మథుడు-2’ సినిమాకు ఒక కథానాయికగా ఫిక్స్ అయినట్లే అంటున్నారు. ఈ సినిమా కన్ఫమ్ అయిన కొన్ని రోజుల్లోనే పాయల్ మరో సీనియర్ హీరోకు జోడీగా ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే ‘ఎఫ్-2’తో భారీ విజయాన్నందుకు విక్టరీ వెంకటేష్.. దీని తర్వాత మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’లో నటించనున్న సంగతి తెలిసిందే.

ఇందులో ఆయన సరసన పాయల్ నటించబోతోందట. వెంకీ సరసన పలువురిని పరిశీలించి చివరికి పాయల్‌ను ఓకే చేశాడట దర్శకుడు బాబీ. ఇందులో నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ నటించబోతోంది. ఆమె కంటే జూనియర్ అయిన పాయల్.. వెంకీ పక్కన నటించడం చిత్రమే. ఇలా వరుసగా ఇద్దరు పెద్ద హీరోల పక్కన నటించాక పాయల్‌కు యంగ్ హీరోల పక్కన ఛాన్సులొస్తాయా అన్నదే సందేహం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English