దీనికి ప్రెస్ నోట్ ఎందుకు రజనీ సార్?

దీనికి ప్రెస్ నోట్ ఎందుకు రజనీ సార్?

సూపర్ స్టార్ రజనీకాంత్ కొంత విరామం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తాను కానీ.. తాను పెట్టబోయే పార్టీ తరఫున అభ్యర్థులు కానీ పోటీ చేయరని ఆయన స్పష్టం చేశారు. తన పేరును, పార్ట ీగుర్తును ఎవరూ వాడుకోవద్దని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్లు ఆలోచించి ఓట్లు వేసుకోవచ్చని రజనీ అన్నారు. ఐతే ఇప్పుడు రజనీ ప్రత్యేకంగా ప్రెస్ నోట్ ఇచ్చి తాను పార్లమెంటు ఎన్నికల బరిలో ఉండనని చెప్పాల్సిన అవసరం ఉందా అన్నదే ప్రశ్న.

రజనీ ఇంకో రెండు మూడు నెలల్లో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఎవరూ భావించడం లేదు. రాజకీయారంగేట్రం గురించి చాలా ఏళ్ల పాటు దోబూచులాడిన రజనీ.. తాను పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాక కూడా అదే దోబూచులాట కొనసాగిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడ్డాక కానీ ఆయనకు రాీజకీయాల్లోకి వచ్చే ధైర్యం రాలేదు. ఆ ధైర్యం వచ్చాక అయినా కొంచెం దూకుడుగా వ్యవహరిస్తారని అభిమానులు ఆశించారు.

కానీ ఈ విషయంలో ఎప్పుడూ రజనీ నిరాశకు గురి చేస్తూనే ఉన్నారు. కమల్ లాగా ఆయన పార్టీ వివరాలు, విధి విధానాలు ప్రకటించలేదు. గ్రౌండ్ వర్క్ ఏమీ చేయలేదు. నేరుగా అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అన్నట్లుగా ఉంటున్నారు. ఎడతెరపి లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. రాజకీయాల్లోకి రాబోతూ.. కొంచెం ఎక్కువగా సంపాదించుకుందాం అన్నట్లుగా ఉంది ఆయన తీరు. కెరీర్లో ఎన్నడూ లేనంత వేగంగా సినిమాలు చేసుకుంటున్నారు.

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండగా.. కనీసం ఏడాది ముందయినా సినిమాలకు టాటా చెప్పి పార్టీ నిర్మాణం గురించి పట్టించుకుంటారని.. క్షేత్ర స్థాయిలోకి దిగి ఏవైనా కార్యక్రమాలు చేస్తారని ఆశించారు కానీ.. రజనీ అలాంటిదేమీ చేయలేదు. అప్పుడప్పడూ ఒక ప్రెస్ నోట్ మినహాయిస్తే ఆయన చేస్తున్నదేమీ లేదు. మరీ ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకుని నేరుగా ముఖ్యమంత్రి అయిపోవాలని ఆశిస్తే ఎలా? అలా ఉంటే జనాలకు ఎలా నమ్మకం కలుగుతుంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English