మన హీరోయిన్లలో ఎవరేం చదివారబ్బా?

మన హీరోయిన్లలో ఎవరేం చదివారబ్బా?

చదువు సరిగా అబ్బని వాళ్లే సినిమాల్లోకి వస్తారనే అభిప్రాయం ఉండేది ఒకప్పుడు. కానీ పరిస్థితులు చాలా మారాయి. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చేవాళ్లందరూ బాగా చదువుకునే వస్తున్నారు. ఇటు నటీనటులు, అటు టెక్నీషియన్లు.. అందరూ కూడా మినిమం డిగ్రీ చేసి కానీ సినిమాల వైపు చూడట్లేదు. హీరోయిన్లలో అయితే దాదాపుగా ప్రతి ఒక్కరూ డిగ్రీ పట్టా పుచ్చుకున్నాకే సినిమాల్లో అడుగు పెడతున్నారు.

తక్కువ వయసులో తెరంగేట్రం చేసిన వాళ్లు కూడా సినిమాల్లో నటిస్తూనే డిగ్రీలు చేస్తున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ప్రధానమైన హీరోయిన్లందరూ మంచి చదువరులే. వారిలో ఎవరేం చదువున్నారో ఒకసారి చూద్దాం పదండి.

‘ఏం మాయ చేసావె’తో మాయ చేసిన సమంత.. ఆ సినిమా చేసే సమయానికే కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకుంది. చందమామ కాజల్.. మాస్ మీడియా డిగ్రీ పూర్తి చేసింది. ఇక కొంచెం లేటుగా సినిమాల్లోకి వచ్చిన అనుష్క.. అప్పటికే బీసీఏ చదివింది. రకుల్ ప్రీత్ సింగ్.. మ్యాథమేటిక్స్‌లో డిగ్రీ తీసుకోవడం విశేషం. ప్రస్తుత సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్‌‌లో డిగ్రీ పుచ్చుకుంది. నయనతార, తమన్నా బీఏ చదివారు. రాశి ఖన్నా, అనుపమ పరమేశ్వరన్, అమలా పాల్.. ఈ ముగ్గురూ కూడా ఇంగ్లిష్‌లో బీఏ చదివారు. శ్రియ లిటరేచర్లో బీఏ చేసింది.

సాయిపల్లవి ఎంబీబీఎస్ చదువుతూ మధ్యలో సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఆ తర్వాత డిగ్రీ ముగించుకుని వచ్చింది. త్రిష బ్యాచిరల్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. తాప్సి, నివేథా థామస్, రీతూ వర్మ బీటెక్ చదివారు. శ్రుతి హాసన్, రెజీనా, అను ఇమ్మాన్యుయెల్ సైకాలజీలోో గ్రాడ్యుయేషన్ చేశారు. షాలిని పాండే కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్. పూజా హెగ్డే కామర్స్‌లో మాస్టర్స్ చదవడం విశేషం. ప్రస్తుత హీరోయిన్లలో ఉన్నత విద్యావంతురాలు ఆమే అనుకోవచ్చు. మీడియాతో చాలా ధీమాగా మాట్లాడే రష్మిక మందన్నా జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ తీసుకుంది. నిత్య మీనన్ కూడా జర్నలిజంలో డిగ్రీ చేసింది. మెహ్రీన్ కౌర్, లావణ్య త్రిపాఠి, ఇలియానా, స్వాతి రెగ్యులర్ డిగ్రీలే చేశారు. మంచు లక్ష్మి థియేటర్ ఆర్ట్స్‌‌లో డిగ్రీ చదివి సినిమాల్లోకి వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English