‘గల్లీ బాయ్’పై మెగా ఫ్యామిలీ కన్ను?

‘గల్లీ బాయ్’పై మెగా  ఫ్యామిలీ కన్ను?

గల్లీబాయ్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. దేశ విదేశాల్లో ఈ సినిమాకు అద్భుత స్పందన వస్తోంది. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా అద్భుతం అంటున్నారు. ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే.. అటు ప్రేక్షకాదరణ కూడా పొందుతోందీ సినిమా.

గత ఏడాది చివర్లో ‘సింబా’ లాంటి మాస్ మూవీతో హిట్ కొట్టిన రణ్వీర్ కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రమిది. ఫర్హాన్ అక్తర్ సోదరి జోయా అక్తర్ ఈ చిత్రాన్ని రూపొందించింది. వేలంటైన్స్ డే కానుకగా దీన్ని రిలీజ్ చేశారు. విడుదలకు ముందే బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమై స్టాండింగ్ ఒవేషన్ తెచ్చుకున్న ఈ సినిమా.. విడుదల తర్వాత ఇండియాలోనూ ఇదే రకమైన స్పందన తెచ్చుకుంటోంది.

ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. టాలీవుడ్లో పలువురు ఈ సినిమా చూసి రీమేక్ దిశగా ఆసక్తి చూపించారట. ప్రధానంగా మెగా ఫ్యామిలీ వాళ్లను ‘గల్లీ బాయ్’ బాగా ఊరిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్‌తో పాటు మెగా ఫ్యామిలీ ప్రముఖులు ఈ సినిమా చూశారట. దీన్ని వరుణ్ తేజ్ లేదా సాయిధరమ్ తేజ్‌తో రీమేక్ చేయాలని భావిస్తున్నారట.

రామ్ చరణ్ పేరు కూడా వినిపిస్తుండటం విశేషం. కానీ చరణ్ ఈ సినిమా చేయడం డౌటే. ‘గల్లీ బాయ్’ రీమేక్ హక్కుల కోసం టాలీవుడ్ నుంచి గట్టి పోటీ అయితే నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇంకా మరి కొన్ని భాషల్లో ఈ చిత్రం రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి తెలుగు ‘గల్లీ బాయ్’ ఎవరవుతారో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English