అర్జున్ రెడ్డికి మరో పిల్ల దొరికింది

అర్జున్ రెడ్డికి మరో పిల్ల దొరికింది

అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ 'వర్మ' పరిస్థితి ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏ ముహూర్తన స్టార్ హీరో విక్రమ్ కొడుకు  ధృవ్ మొదటి సినిమాను స్టార్ట్ చేశారో గాని బాలా లాంటి క్రియేటివ్ రియాలిటీ దర్శకుడికి మరచిపోలేని మచ్చ పడింది. సినిమా షూటింగ్ కనీసం ఓ కొలిక్కి రాకముందే హీరోయిన్ అండ్ డైరెక్టర్ వల్లే సినిమా క్యాన్సిల్ అని తేలిసిపోయింది. ఇక ఫ్రెష్ గా మళ్ళీ వర్మ ను మొదలెట్టాలని తనయుడు కెరీర్ ఫస్ట్ లొనే దారి తప్పకూడదని విక్రమ్ కఠినమైన నిర్ణయమే తీసుకున్నాడు.

ఇక దర్శకుడిని అలాగే హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు. హీరోయిన్ గా ఇటీవల అక్టోబర్ అనే బాలీవుడ్ మూవీతో బాలీవుడ్ జనాలను ఆకర్షించిన బణిత సంధుని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్ నటించిన అక్టోబర్ సినిమాలో అమ్మడు నటించిన తీరుకు మంచి ప్రశంసలు అందాయి. కాని సినిమా డిజాష్టర్ కావడంతో బాలీవుడ్లో అమ్మడికి ఛాన్సులు రాలేదు. కాని ఆ సినిమాలో ఆమె చేసిన సటిల్ పెర్ఫామెన్స్ 'వర్మ'కు పర్ఫెక్ట్ గా సరిపోతుందని అనుకుంటున్నారట. సినిమాను వీలైనంత త్వరగా మొదలెట్టాలని చూస్తున్నారు.

ఇక దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. తెలుగు అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ వంగ దగ్గర సహాయ దర్శకుడిగా పని చేసిన గిరిశయ్య అనే అసిస్టెంట్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తే బెటర్ అని ఆ సినిమాకు వర్క్ చేశాడు కాబట్టి అతనికి కథపై పట్టు ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ కూడా విక్రమ్ గ్యాంగ్ కు అదే సజేషన్ ఇచ్చినట్లు టాక్. మరి ఈ వర్మ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English